టీ20 వరల్డ్‌కప్‌లో భారత్‌తో మ్యాచ్ వివాదంలో పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నక్వీ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ పేరును ప్రస్తావించి కొత్త వివాదానికి తెరలేపారు. ఐసీసీ ఒత్తిళ్లకు భయపడబోమని వ్యాఖ్యానించారు. అయితే, ప్రధాని షెహబాజ్ షరీఫ్ జోక్యంతో పాకిస్తాన్ చివరకు మ్యాచ్ ఆడేందుకు అంగీకరించింది. రాజకీయ రంగు పూసిన ఈ వివాదం మరోసారి పాకిస్తాన్ క్రికెట్‌పై విమర్శలు తెచ్చింది. ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా భారత్ - పాక్ మధ్య టీ20 వరల్డ్‌కప్ మ్యాచ్ జరగనుంది.