test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

సమీకృత పాఠశాలలు’ నిర్ణయంపై మండిపడిన కె.కవిత

2 గంటల క్రితం

k-kavitha-angry-over-the-decision-of-integrated-schools
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 08, 2026, 04:51 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన సమీకృత పాఠశాలలు నిర్ణయంపై టి ఆర్ ఎస్ చీఫ్ కె.కవిత మండిపడ్డారు. రాష్ట్రంలోని 27,000 పాఠశాలలను 4,000కు కుదించనున్నట్లు సిఎం ప్రకటించడం తీవ్ర అభ్యంతరకరమని సోమవారం విడుదల చేసిన ఒక వీడియో ప్రకటనలో ఆమె పేర్కొన్నారు. పేద విద్యార్థులను, ముఖ్యంగా బాలికలను విద్యకు దూరం చేసేలా ఉన్న ఈ నిర్ణయం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని గురుకుల పాఠశాలల్లో సుమారు 100 మందికి పైగా విద్యార్థులు మరణించినా సిఎం కనీసం సమీక్ష కూడా నిర్వహించలేదని మండిపడ్డారు. ఇప్పుడు పాఠశాలలు మూసివేస్తున్నామని ప్రకటించారని, విద్యాశాఖపై ప్రభుత్వానికి కనీస పట్టు లేదని ఈ నిర్ణయం స్పష్టం చేస్తోందని అన్నారు. బెంగళూరులో జరిగిన ఒక కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని 27,000 ప్రభుత్వ పాఠశాలల్లో 18 లక్షల మంది విద్యార్థులుండగా, 12,000 ప్రైవేట్ స్కూళ్లలో 35 లక్షల మంది చదువుతున్నారని రేవంత్ రెడ్డి తెలిపారు. నాణ్యమైన విద్యను అందించే లక్ష్యంతో నర్సరీ నుంచి 12వ తరగతి వరకు ఒకేచోట విద్య, ఉచిత రవాణా, భోజన వసతులతో కూడిన ‘సమీకృత పాఠశాలలను’ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్