ఫైనల్లో అర్సెనాల్‌పై ఉత్కంఠ విజయం
బుదాపెస్ట్ (హంగరీ) : పారిస్ సెయింట్ జర్మెన్ (పిఎస్‌జి) చరిత్ర సృష్టించింది. 21వ శతాబ్దంలో రియల్ మాడ్రిస్ తర్వాత వరుసగా రెండు సీజన్లు యూరోపియన్ ఛాంపియన్స్ లీగ్ (యుసిఎల్) విజేత జట్టుగా నిలిచింది. ఆదివారం బుదాపెస్ట్‌లో జరిగిన యుఇఎఫ్‌ఎ ఛాంపియన్స్ లీగ్ ఫైనల్లో అర్సెనాల్‌పై పిఎస్‌జి ఉత్కంఠ విజయం సాధించింది. 90 నిమిషాల ఆటలో అర్సెనాల్, పిఎస్‌జి 1-1తో సమవుజ్జీలుగా నిలిచాయి. 30 నిమిషాల అదనపు సమయంలోనూ స్పష్టమైన విజేత తేలలేదు. దీంతో ఫలితాన్ని షూటౌట్ ద్వారా నిర్ణయించారు. షూటౌట్‌లో పిఎస్‌జి 4-3తో అర్సెనాల్‌పై పైచేయి సాధించింది. అంతకముందు తొలుత ఆట మొదలైన ఆరో నిమిషంలోనే గోల్ కొట్టిన కై హావెర్జ్ట్ అర్సెనాల్‌కు 1-0తో విలువైన ఆధిక్యం అందించాడు. ప్రథమార్థం ముగిసేవరకు అర్సెనాల్ ముందంజలో నిలిచింది. ఉస్మాన్ డెంబెలే 64వ నిమిషంలో లభించిన పెనాల్టీని గోల్‌గా మలిచాడు. దీంతో స్కోరు 1-1తో సమమైంది. ఇంజూరీ టైమ్ సహా అదనపు సమయంలోనూ ఇరు జట్లు మరో గోల్ కొట్టలేదు. 93 శాతం పాస్ కచ్చితత్వం, 72 శాతం బంతి నియంత్రణతో పిఎస్‌జి ఫైనల్లో తిరుగులేని ఆధిపత్యం చెలాయించింది.









కామెంట్‌లు (0)