test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

గాడితప్పిన రెండేళ్ళ కూటమి పాలన

1 గంట క్రితం

cpm press meet
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 08, 2026, 06:14 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

డబుల్ ఇంజన్ సర్కార్ పేరుతో తెలుగుదేశం నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్ళలో ప్రజలకిచ్చిన హామీలు అమలు జరపడంలోనూ, యువత భవిష్యత్తుకు భరోసా ఇవ్వడంలోనూ పూర్తిగా విఫలమైంది. జూన్ 8వ తేదీకి రెండు సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా టిడిపి కూటమి చేస్తున్న హడావుడి కార్యక్రమాలతో ప్రజలను భ్రమల్లోకి నెట్టలేరు. పైగా రాష్ట్రంలో మతోన్మాదం పెచ్చరిల్లుతోంది. రాష్ట్రాభివృద్ధికి తోడ్పడే జాతీయ సంపద పెద్ద ఎత్తున లూటీకి గురవుతున్నది. ఐదేళ్ళ పాలనకు మొదటి రెండు సంవత్సరాలు చాలా ముఖ్యమైన కాలం. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయడానికి, గత ప్రభుత్వానికి భిన్నంగా, మెరుగైన ప్రజా సంక్షేమాన్ని, రాష్ట్రాభివృద్ధి వైపు సాగడానికి ఈ కాలం చాలా కీలకమైనది. ‘సూపర్ 6’తో పాటు, 143 రకాల హామీలు తెలుగుదేశం, జనసేన, బిజెపి పార్టీల భారీ విజయానికి కారణమయ్యాయి అయితే ఈ రెండేళ్ళ పాలనతీరు రెండు ప్రమాదకర మార్గాల్లో సాగుతున్నది. ఒకటి, 2047 విజన్ పేరుతో వేగంగా ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ విధానాలను అమలు చేయడం. కార్మికులపై అణచివేత, వ్యవసాయ సంక్షోభం, ఆర్థిక సామాజిక అసమానతలు పెరిగాయి. రెండు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక లక్ష్యాల్లో కీలకమైన మతసామరస్యం, ఫెడరలిజాన్ని వొదలి మతోన్మాద అర్ఎస్ఎస్ అజెండాను నెత్తికెత్తుకోవడం, రాష్ట్రం హక్కుల్ని ఫణంగా పెట్టడం. బిజెపి సాహచర్యంతో తెలుగుదేశం మౌళిక లక్ష్యాలకే భిన్నంగా పోతున్నది. ఈ విధానాలు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్త్‌కు చాలా నష్టం కలుగచేస్తాయి.




ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్