ప్రజాశక్తి – గిద్దలూరు : కర్నూలు జిల్లాలో పని ఒత్తిడి తాళలేక గ్రామ రెవెన్యూ అధికారి మహమ్మద్ హుస్సేన్ ఆత్మహత్యకు పాల్పడటం అత్యంత విచారకరమని, ఆయన మృతికి కారణమైన వారిపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం మార్కాపురం జిల్లా అధ్యక్షుడు వై.పి. రంగయ్య డిమాండ్ చేశారు. సోమవారం గిద్దలూరు తహసీల్దార్ కార్యాలయం వెలుపల వీఆర్వోల సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. మృతి చెందిన హుస్సేన్ కుటుంబానికి న్యాయం చేయాలంటూ ఈ సందర్భంగా ఉద్యోగులు పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఈ నిరసనను ఉద్దేశించి వై.పి. రంగయ్య మాట్లాడుతూ… క్షేత్రస్థాయిలో రెవెన్యూ ఉద్యోగులపై పని ఒత్తిడి రోజురోజుకూ మితిమీరిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాణాలు కోల్పోయిన మహమ్మద్ హుస్సేన్ కుటుంబానికి ప్రభుత్వం ఆర్థికంగా అండగా నిలవాలని కోరారు. భవిష్యత్తులో ఇలాంటి దారుణ సంఘటనలు పునరావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వంతో పాటు, జిల్లా కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. గ్రామ రెవెన్యూ అధికారులు, గ్రామ సర్వేయర్లు, గ్రామ రెవెన్యూ సహాయకుల పై ఉన్న అదనపు పని భారాన్ని తగ్గించాలని, ఇందుకు గాను ‘సింగిల్ లైన్ మానిటరింగ్ సిస్టమ్’ను తక్షణమే ఏర్పాటు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఈ నిరసన కార్యక్రమంలో గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం జిల్లా ఉపాధ్యక్షులు అరిగెల వెంకటరామయ్య, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీరామ అజయ్ కుమార్, వీఆర్వోల సంఘం నాయకులు బిజ్జం రాజశేఖర్ రెడ్డి, డి అచ్చయ్య, పప్పుల కొండయ్య, ఆంజనేయులు, ఖాసీంపీరా, వెంకటేశ్వర్లు, ఖాసీంవలి, సిద్దయ్య గ్రామ సర్వేయర్లు దూదేకుల ఖాజావలి, రమేష్ రెడ్డి, శివప్రసాద్ రెడ్డి, ప్రవల్లిక, శ్రీకాంత్, వెంకట్రావుతో పాటు విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ల రాష్ట్ర కార్యదర్శి అంజి, సంఘం నాయకులు అల్లూరయ్య తదితరులు పాల్గొని హుస్సేన్ కుటుంబానికి తమ మద్దతును ప్రకటించారు.
వీఆర్వో ఆత్మహత్యకు కారకులైన అధికారులపై చర్యలు తీసుకోవాలి
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 08, 2026, 04:25 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం






కామెంట్‌లు (0)