test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఒమన్ తీరంలో భారతీయ నౌకపై దాడి

1 గంట క్రితం

Shipping Ministry confirms attack on vessel carrying 24 Indian seafarers
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 08, 2026, 05:59 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ :  ఒమన్ తీరంలో భారతీయ నౌకపై దాడి జరిగింది. హార్ముజ్ జలసంధికి దక్షిణంగా 24మంది భారతీయ నావికులతో వెళుతున్న ఎంటి మారివెక్స్ నౌకపై దాడి జరిగిందని ఓడరేవులు, నౌకాయానం, జలమార్గాల మంత్రిత్వ శాఖ (ఎంఒపిఎస్ డబ్ల్యు) సోమవారం ధృవీకరించింది. అయితే ప్రస్తుతం సిబ్బంది అంతా సురక్షితంగా ఉన్నారని తెలిపింది. పశ్చిమాసియాలోని తాజా పరిణామాలపై జరిగిన అంతర్ మంత్రిత్వ సమావేశంలో షిప్పింగ్ విభాగం డైరెక్టర్ ఒపేష్ కుమార్ శర్మ మాట్లాడుతూ.. ఈ రోజు మధ్యాహ్నం 1.30 గంటలకు నౌకలో అగ్ని ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక సమాచారం అందిందని అన్నారు. సిబ్బంది అంతా క్షేమంగా ఉన్నారని అన్నారు. సముద్రయాన సిబ్బంది భద్రతను నిర్ధారించడానికి తమ మంత్రిత్వ శాఖ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, విదేశాల్లోని భారత మిషన్లు, భారత నౌకాదళం, రక్షణ మంత్రిత్వ శాఖల సంప్రదిస్తున్నామని అన్నారు. నౌకపై ఆయుధం లేదా డ్రోన్ వంటివి ఢీకొట్టాయా లేదా అనేది ఇప్పుడే స్పష్టం చేయలేమని అన్నారు. ఆ నౌక హార్ముజ్ జలసంధికి దక్షిణ దిశగా స్పష్టమైన దూరంలో ఉందని అన్నారు. దాడి జరిగిన నౌకలో ఎటువంటి సరుకు లేదని అన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్