test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

IND vs AFG: భారత్ ఘన విజయం

1 గంట క్రితం

India thrash Afghanistan by innings
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 08, 2026, 03:52 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

చండీగఢ్‌ : అఫ్గానిస్థాన్‌తో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది.  భారత్ ఇన్నింగ్స్ 300 పరుగుల తేడాతో భారీ విజయం నమోదు చేసింది.  టెస్టుల్లో టీమ్ఇండియాకు ఇది అతిపెద్ద విజయం కావడం విశేషం. తొలి ఇన్నింగ్స్‌లో 113/5 స్కోరుతో మూడో రోజు ఆటను మొదలుపెట్టిన అఫ్గాన్ 152 పరుగులకే కుప్పకూలింది. ఈ క్రమంలో 412 పరుగుల ఆధిక్యం సంపాదించిన భారత్.. అఫ్గాన్‌ను ఫాలో ఆన్‌ ఆడించింది. ఆఫ్గాన్ జట్టు తమ సెకండ్ ఇన్నింగ్స్‌లో మరింత ఘోరంగా ఆడింది. టీ విరామ సమయానికి 98/5తో నిలిచిన ఆ జట్టు.. చివరి సెషన్‌ ఆరంభంలో వరుసగా వికెట్లు కోల్పోయింది. 112 పరుగులకే ఆ తొమ్మిది వికెట్లు నష్టపోయింది. షరాఫుద్దీన్ అష్రఫ్ గాయం కారణంగా బ్యాటింగ్‌కు దిగకపోవడంతో అఫ్గానిస్థాన్ ఇన్నింగ్స్ ముగిసింది. అఫ్గాన్ సెకండ్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్ సెథిఖుల్లా అటల్ (42) టాప్ స్కోరర్ గా నిలిచారు. రహ్మనుల్లా గుర్బాజ్ (24), రహ్మత్‌ షా (13) పరుగులు చేశారు. మిగతా బ్యాటర్లంతా సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ 4, కుల్‌దీప్ యాదవ్ 3, మానవ్ సుతార్, సిరాజ్ ఒక్కో వికెట్ తీసుకున్నారు. భారత్ ఇన్నింగ్స్‌లో 564/8 వద్ద డిక్లేర్ చేసింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్