mh ad
శుక్రవారం, 19 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

తెలంగాణలో నైరుతి విస్తరణ ఆలస్యం.. పలు జిల్లాల్లో వర్షాలు

10 జూన్, 2026

Southwest monsoon has not yet spread across Telangana trees and rain
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 10, 2026, 04:26 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

హైదరాబాద్: తెలంగాణలో నైరుతి రుతుపవనాల విస్తరణ ఆలస్యం కానుందని వాతావరణ శాఖ బుధవారం ప్రకటించింది.   ప్రసుతం నైరుతి రుతుపవనాలు తెలంగాణలోకి ప్రవేశించినా జోగులాంబ గద్వాల జిల్లాలోనే కేంద్రీకృతమయ్యాయని తెలిపింది. మూడు, నాలుగు రోజుల్లో విస్తరించే అవకాశాలున్నాయని పేర్కొంది. వీటి ప్రభావంతో బుధవారం నల్గొండ, రంగారెడ్డి, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి, జోగులాంబ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేశారు. గురు, శుక్రవారాల్లోనూ ఉరుములు, మెరుపులతో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అన్నారు. గంటకు 40 నుంచి 50 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశముందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్