mh ad
బుధవారం, 17 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

కార్గో ఎయిర్పోర్ట్ కోసం భూములు ఇస్తున్నామన్నది తప్పుడు ప్రచారం : భేతాళపురం బాధిత రైతులు

3 గంటల క్రితం

Claims that we are handing over land for the cargo airport are false propaganda: Affected farmers of Bethalapuram.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 17, 2026, 04:07 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

మందస మండలం (శ్రీకాకుళం) : భేతాళపురం గ్రామంలో రెండు రోజుల క్రితం కొన్ని వార్తపత్రికల్లో వచ్చినటువంటి సమాచారం ప్రకారం ఉద్దానం కార్గో ఎయిర్పోర్ట్ కోసం భూములు ఇవ్వడానికి భేతాళపురం గ్రామ రైతులు ముందుకు వచ్చారనేది పూర్తి స్థాయిలో అవాస్తవం అని బాధిత రైతులు, గ్రామస్తులు తెలియజేసారు. ఇటువంటి తప్పుడు ప్రచారాలు ఇకనైనా మానుకోవాలని, భూములు ఇచ్చేది లేదని తేల్చిచెప్పారు. గత 20 నెలలుగా పచ్చని మా ఉద్దాన భూముల్లో కార్గో ఎయిర్పోర్ట్ నిర్మాణం చేపట్టారాదని అనేక విధాలుగా నిరసనలు తెలియజేస్తూనే ఉన్నామన్నారు. జిల్లా కలెక్టర్ స్వప్నికల్ దినకర్ కి, స్థానిక శాసన సభ్యురాలు శిరీష కి, కేంద్రపౌర విమానయన శేఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, ఇతర అధికారులకు, ప్రభుత్వ పెద్దలకు కూడా తమ వైఖరిని స్పష్టంగా తెలియజేశామన్నారు. వంశపారంపర్యంగా వస్తున్నటివంటి తమ భూములు నిత్యం ఆదాయం ఇచ్చే కొబ్బరి, జీడి, మామిడి, పనస, మునగ, మామిడి అలాగే మూడు పంటలు పండే పొలాలు ముఖ్యంగా కూరగాయలు, ఆకుకూరలు పండించే బంగారు భూములుని కార్గో ఎయిర్పోర్ట్ నిర్మాణం కోసం తీసుకోని కార్పొరేట్ కంపెనీలకు కట్టపెట్టవద్దని, భూమునే నమ్ముకున్న రైతుల పొట్ట కొట్టవద్దని ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ వారికీ విన్నవించుకున్నారు. గ్రామాలకు దూరంగా ఎక్కడైనా ప్రభుత్వ, అసైండ్ భూములు ఉంటే అక్కడ ఇటువంటి నిర్మాణాలు చేసుకోవాలని కోరారు. ఇకనైనా ఇలాంటి తప్పుడు ప్రచారాలు మానుకోవాలని, రైతుల అభిప్రాయాలు పరిగణలోకి తీసుకోవాలని కోరుతూ ఉద్దానం ప్రాంతంలో కార్గో ఎయిర్పోర్ట్ నిర్మాణాన్ని ముక్త కంఠంతో వ్యతిరేకించారు. ఈ కార్యక్రమంలో మడియా పురుషోత్తం, బత్తిని ఉమాపతి, గార ఆనంద్ రావు, కార్గో ఎయిర్ పోర్ట్ వ్యతిరేక పోరాట కమిటీ మీడియా వింగ్ కన్వీనర్ బత్తిని లక్ష్మణ్,జుత్తు నారాయణ, సాహుకరి కృష్ణా రావు, బత్తిని తులసి రావు, దున్న పార్వతి, కీలు గున్నమ్మ, మడియా రుషి,దున్న మోహన్ రావు, కోరిబిల్లి సుమలత, సాహుకరి ఉపేంద్ర, మడియా వళ్ళమ్మ మరియు పెద్ద ఎత్తున మహిళా రైతులు, యువకులు పాల్గొని నిరసన తెలియజేశారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్