mh ad
బుధవారం, 17 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

కోల్ కతాలో లొంగిపోయిన మహిళా మావోయిస్టు

4 గంటల క్రితం

Maoist woman with ₹10-lakh bounty surrenders
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 17, 2026, 03:53 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

కోల్ కతా : రూ.10 లక్షల రివార్డు ఉన్న మహిళా మావోయిస్టు శకుంతల (అలియాస్ పుష్ప) పోలీసుల ఎదుట లొంగిపోయారు. గన్, 40 రౌండ్ల బుల్లెట్లతో బుధవారం ఉదయం ఆమె లోంగిపోయారని కోల్ కతా పోలీస్ కమిషనర్ అజయ్ కుమార్ నందా ఒక ప్రకటనలో తెలిపారు. ఆమె ఝార్ గ్రామ్ జిల్లా బెల్పాహారి ప్రాంతంలోని మెచువా గ్రామానికి చెందినవారు. సిపిఐ(మావోయిస్ట్) పార్టీకి చెందిన దల్మా స్క్వాడ్ లో సభ్యురాలిగా ఉన్నారు. 2001లో ఆమె సాంస్కృతిక విభాగంలో చేరారు. జార్ఖండ్ లో కీలక సభ్యురాలిగా పనిచేస్తున్న సమయంలో ప్రభుత్వం రూ.10 లక్షల రివార్డు ప్రకటించిందని అన్నారు. పశ్చిమబెంగాల్, పోరుగు రాష్ట్రాల్లో ఆమెపై నాలుగు కేసులు నమోదయ్యాయని వెల్లడించారు.  ఐదవ తరగతిలో ఉన్నప్పుడే ఆమె మావోయిస్టుల్లో చేరారని, అప్పటి నుండి ఒడిశా, జార్ఖండ్, బీహార్ రాష్ట్రాల్లో కీలక సభ్యురాలిగా ఉన్నారని అన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్