ప్రజాశక్తి-సూళ్లూరుపేట రూరల్ (తిరుపతి) : ప్రమాదవశాత్తూ కాళంగి నదిలో పడి యువకుడు మృతి చెందిన ఘటన బుధవారం వెలుగుచూసింది. సూళ్లూరుపేటలోని శ్రీచెంగాళమ్మ ఆలయం సమీప కాళంగి నదిలో పడి ఓంకార్ (31) అనే యువకుడు మంగళవారం మృతి చెందాడు. మన్నారుపోలూరుకు చెందిన అతను ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈరోజు నదిలో మృతదేహం తేలియాడుతుండగా స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ప్రమాదవశాత్తూ కాళంగి నదిలో పడి యువకుడు మృతి
3 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 17, 2026, 04:00 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం







కామెంట్‌లు (0)