mh ad
శుక్రవారం, 19 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఎఎస్సై ఖాతా నుండి డబ్బు కాజేసిన సైబర్ నేరగాళ్లు

11 జూన్, 2026

Cybercriminals siphon off money from ASI's account.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 11, 2026, 03:10 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

తెలంగాణ : హైదరాబాద్ నగరంలోని పంజాగుట్ట పిఎస్‌లో ఎఎస్సైగా పనిచేస్తున్న నరసయ్య సైబర్‌ మోసానికి గురయ్యారు. ఆర్టీఏ చలాన్‌ పేరుతో సైబర్‌ నేరగాళ్లు ఆయనకు ఎపి కే ఫైల్‌ పంపించారు. తద్వారా నరసయ్య బ్యాంకు ఖాతా నుంచి రూ.49,139 కాజేశారు. ఈనెల 8న తన మొబైల్‌ ఫోన్‌కు పలుమార్లు మెసేజ్‌లు వస్తుండటంతో ఎఎస్సై పరిశీలించారు. తన బ్యాంకు ఖాతా నుంచి డబ్బు కట్‌ అవుతున్నట్లు గుర్తించారు. తన ప్రమేయం లేకుండా నగదు పోతుండటంతో ఆందోళనకు గురై సైబర్‌ హెల్ప్‌లైన్‌ నంబర్‌ 1930కు ఫిర్యాదు చేశారు. సైబర్‌ క్రైమ్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్