బ్రెజిల్ : బ్రెజిల్‌లోని లైమీరాలో శనివారం విషాద ఘటన చోటుచేసుకుంది. స్వింగ్ జంప్ సరదా ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. జూన్ 13వ తేదీన గ్రేటర్ సావో పాలోకు చెందిన మరియా ఎడువార్డా రోడ్రిగ్స్ డి ఫ్రీటాస్ (21) అడ్వెంచర్ గేమ్స్లో పాల్గొనడానికి శనివారం స్నేహితులతో కలిసి లైమీరా ప్రాంతానికి వెళ్లింది. అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసింది. బంగీ జంప్ చేయడానికి వంతెన వద్దకు వెళ్లిన యువతిని కిందకు వదిలేయడానికి ముందు అక్కడి సిబ్బంది ఆమె కాళ్లకు తాడును కట్టడం మర్చిపోయారు. ఆమెను పైనుంచి కిందకు తోయడానికి ప్లాట్ ఫామ్ దగ్గరకు తీసుకువచ్చారు. యువతిని చేతులతో ఎత్తుకుని 40 మీటర్ల ఎత్తు నుంచి కిందకు తోశారు. గాల్లోకి ఎగరాల్సిన ఆ యువతి నేరుగా భూమిని ఢీకొట్టింది. తీవ్రమైన గాయాల కారణంగా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. చనిపోవడానికి ముందు ఆమె పెట్టిన చావు కేకతో స్వింగ్ జంప్ స్టాఫ్ మెంబర్స్‌కు అసలు విషయం అర్థమైంది. ఆమెను కిందకు తోసే సమయంలో సేఫ్టీ రోప్ కట్టలేదని గుర్తించారు. అప్పటికే ఆమె ప్రాణాలుపోయాయి. ఇక, సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. భద్రతా తాడును కట్టకుండా సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఆమె మరణించినట్లు జరిగినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందన్నారు. ఆమె మరణానికి గల కారణాలను అన్వేషిస్తున్నారు. ఈ ఘటనకు బాధ్యులైన ఆరుగురు సిబ్బందిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. దర్యాప్తు కొనసాగుతోందన్నారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆ వీడియోల్లో ప్రమాదానికి సంబంధించిన ఒళ్లుగగుర్పొడిచే దృశ్యాలున్నాయి. ఆ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘అందుకే నేను ఎవ్వరినీ నమ్మను. నమ్మితే ఇలా చనిపోవాల్సి వస్తుంది’.. ‘పాపం ఎంతో సంతోషంగా స్వింగ్ జంప్ చేద్దామనుకుంది. ప్రాణం పోయింది’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
నిండు ప్రాణాన్ని బలిగొన్న బంగీ జంప్ సరదా ..!
5 రోజుల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 14, 2026, 12:06 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం








కామెంట్లు (0)