test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

దేశాల భవిష్యత్‌కు ప్రపంచ టెలీ కమ్యూనికేషన్‌ కీలకం : సిఎం చంద్రబాబు

17 మే, 2026

దేశాల భవిష్యత్‌కు ప్రపంచ టెలీ కమ్యూనికేషన్‌ కీలకం : సిఎం చంద్రబాబు
వెబ్ డెస్క్

ప్రచురించబడింది మే 17, 2026, 03:14 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

అమరావతి : దేశాల భవిష్యత్ ‌కు ప్రపంచ టెలీ కమ్యూనికేషన్‌ కీలకం కానుందని సిఎం చంద్రబాబు అన్నారు. ఆదివారం ముఖ్యమంత్రి ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. ఏప్రిల్ 14 న ‘క్వాంటం కంప్యూటింగ్ రిఫరెన్స్ ఫెసిలిటీస్’ ప్రారంభోత్సవం తర్వాత.. ప్రపంచ స్థాయి క్వాంటం వ్యవస్థ దిశగా మరో ముఖ్యమైన అడుగు పడిందన్నారు. దేశీయ సాంకేతిక పరిజ్ఞానంతో క్వాంటం వ్యాలీ ఆవిష్కరణలు, పరిశోధనలు జరుగుతున్నాయన్నారు. భారత ప్రభుత్వ టెలీ కమ్యూనికేషన్‌ విభాగానికి చెందిన సీడాట్‌, అమరావతి క్వాంటం వ్యాలీ భాగస్వామ్యంతో దేశంలో తొలి క్వాంటం-సెక్యూర్‌ కమ్యూనికేషన్స్‌ టెస్ట్‌ బెడ్‌ ఏర్పాటు కానుందని చెప్పారు. ఇది పరిశోధనలకు, పరీక్షలకు తోడ్పడుతుందన్నారు. ఈ చొరవ డిజిటల్‌ సౌకర్యాలకు మనమిచ్చే నిబద్ధతను బలోపేతం చేస్తుందని, అమరావతిని డీప్‌-టెక్‌ ఆవిష్కరణల హబ్‌గా నిలుపుతుందని తెలిపారు. ఎపి విద్యార్థులు భాగస్వాములు కావడానికి అవకాశాలను సృష్టిస్తుందని పేర్కొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్