test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

గోకవరం లో మలేరియా వ్యతిరేక మాసోత్సవాలు

1 గంట క్రితం

anti-malaria-month-festivals-in-gokavaram
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 08, 2026, 02:45 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-గోకవరం  : గోకవరం మండలం జి. కొత్తపల్లి  పి.హెచ్.సి వైద్యాధికారి డాక్టర్. తిరన్, డాక్టర్. నిఖిత పర్యవేక్షణ లో మండలం లోని పలు గ్రామాలలో “మలేరియా వ్యతిరేక మాసోత్సవాలు”కార్యక్రమం నిర్వహించారు. దీనిలో భాగంగా వైద్య ఆరోగ్య సిబ్బంది డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా వంటివి వ్యాప్తి చెందకుండా వాటికి  మూలకారణమైన దోమలను నివారించాలన్నారు. పల్లపు ప్రాంతాలలో నీటి నిల్వలు లేకుండా చూడాలన్నారు. ప్రతీ శుక్రవారం ` ఫ్రై డే డ్రై డే’  నిర్వహిస్తున్న వైద్య సిబ్బందికి సహకరించాలని తెలిపారు.  మండలంలోని అన్ని ప్రభుత్వ వసతి గృహాలలో దోమల నిర్మూలన కు స్ప్రేయింగ్ కార్యక్రమం నిర్వహిస్తున్నారని తెలిపారు. జూన్ 8వ తేదీన సంజీవయ్య నగర్ నందుగల సాంఘిక సంక్షేమ హాస్టల్ నందు, ఎమ్.డి. ఓ ఆఫీస్ ప్రాంగణంలో గల ఎస్.టి. పోస్ట్ మెట్రిక్ బాలుర హాస్టల్ లోను దోమల నివారణ మందును స్ప్రే చేయించామన్నారు. ప్రతీ ఒక్కరూ మలేరియాను అంతమోందించడానికి కృషి చేయాలని  జి. కొత్తపల్లి ఆరోగ్య సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఎమ్.పి.హెచ్.ఏ లు పవన్, రమణ, ఆచారిలు, గోకవరం గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్