test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఆన్‌లైన్ మందుల విక్రయాలతో ‘మాకు’ తీవ్ర నష్టం

20 మే, 2026

medical shops
వెబ్ డెస్క్

ప్రచురించబడింది మే 20, 2026, 01:53 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-యంత్రాంగం: ప్రభుత్వం కరోనా సమయంలో అమల్లోకి తీసుకువచ్చిన జిఎస్ఆర్ టి20 యాక్ట్ రద్దు చేయాలని కోరుతూ కెమిస్ట్రీస్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా బంద్ నిర్వహించారు. బుధవారం ఆలిండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్రీస్ అండ్ అసోసియేషన్ పిలుపుమేరకు కెమిస్ట్రీస్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ చట్టంలో ప్రతిపాదించిన సవరణలను వ్యతిరేకిస్తూ ఏపీ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ అసోసియేషన్ పిలుపులో భాగంగా మెడికల్ షాప్ యజమానులు బంద్ నిర్వహించారు. పలు జిల్లాలో ర్యాలీలు నిర్వహించి, జిల్లా కలెక్టర్లకు మెమొరండం సమర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆన్‌లైన్ మందుల విక్రయాలను నియంత్రించాలని, చిన్న మెడికల్ షాపుల మనుగడకు భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు. ఔషధ రంగంలో అమలవుతున్న కొన్ని విధానాల వల్ల చిన్న వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల ఆరోగ్య భద్రత దృష్ట్యా నాణ్యమైన మందుల విక్రయాలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. కోవిడ్ సమయంలో విధించిన యాక్టును రద్దు చేయకపోవడంతో అది ఆన్లైన్ విధానం కొనసాగుతూ ఉండడంవల్ల యువత ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందన్నారు. అదేవిధంగా ఆన్లైన్ మందులు కొనుగోలు విధానం వలన ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందన్నారు. అధిక డిస్కౌంట్ ఆశపడి ఆన్లైన్ విధానంలో మెడికల్ ఆర్డర్ ఇవ్వడం వలన మందులు మారిపోయే ప్రమాదం ఉందన్నారు. దీంతో ప్రజలకు డాక్టర్లు ఇచ్చే మందులు ఇవి ఒకటే అనుకుని వాడి ప్రాణాలపైకే తెచ్చుకుంటున్నారన్నారు. అధిక డిస్కౌంట్కు మోసపోవద్దన్నారు. రాష్ట్రంలో 10 లక్షల మంది చిరు వ్యాపారుల కష్టాల్లోకి నెట్టే కార్పొరేట్ సెక్టార్ మెడికల్ దందా సాగుతుందన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్