తెలంగాణ : ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో రెడ్‌హిల్స్ జలమండలి జనరల్ మేనేజర్ అనంత్ లక్ష్మీకుమార్ ఇంట్లో ఎసిబి అధికారులు మంగళవారం సోదాలు నిర్వహించారు. హైదరాబాద్‌లోని ఆయన నివాసంతో పాటు అతని బంధువుల ఇళ్లలో ఏకకాలంలో 8 ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. మల్లాపూర్‌లోని కుమార్ నివాసంలో ఎసిబి డీఎస్పీ మజీద్ అలీ ఖాన్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు విస్తృతంగా తనిఖీలు చేపట్టాయి. ఈ దాడుల్లో భారీగా నగదు బయటపడినట్లు తెలిసింది. ఇప్పటికే రూ.100 కోట్లకు పైగా అక్రమాస్తులను గుర్తించినట్లుగా సమాచారం. ఇంట్లో కుప్పలుగా ఉన్న నోట్ల కట్టలను చూసి ఎసిబి అధికారులు సైతం ఆశ్చర్యానికి గురైనట్లు సమాచారం. స్వాధీనం చేసుకున్న నగదు భారీగా ఉండటంతో లెక్కింపును కౌంటింగ్ మెషిన్లను ఉపయోగిస్తున్నారు.
అధికారి ఇంట్లో ఎసిబి సోదాలు – కుప్పలుగా నోట్ల కట్టలు ..!
19 మే, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది మే 19, 2026, 12:10 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం







కామెంట్‌లు (0)