test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print EditionWFI Notices: వినేష్ ఫొగాట్‌ పై డబ్ల్యూఎఫ్‌ఐ అనర్హత వేటు

09 మే, 2026

vinesh phogot
వెబ్ డెస్క్

ప్రచురించబడింది మే 09, 2026, 10:51 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

భారత స్టార్ రెజ్లర్ వినేష్ ఫొగాట్‌పై భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) అనర్హత వేటు వేసింది. పారిస్ ఒలింపిక్స్ 2024 తర్వాత రిటైర్మెంట్ ప్రకటించి, నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని తిరిగి మ్యాట్‌పైకి అడుగుపెట్టాల నుకున్న ఆమె ఆశలకు బ్రేక్ వేసింది. ఈ నెల 10 నుంచి 12 వరకు గోండాలో జరగ నున్న నేషనల్ ఓపెన్ ర్యాంకింగ్ టోర్న మెంట్‌లో పాల్గొనకుండా ఆమెను నిషేధిం చింది. యాంటీ-డోపింగ్ నిబంధనల ఉల్లంఘన, క్రమశిక్షణా రాహిత్యం కింద డబ్ల్యూఎఫ్‌ఐ ఆమెకు 15 పేజీల షోకాజ్ నోటీసును జారీ చేసింది. దీంతో పాటు 2026 జూన్ 26 వరకు దేశవాళీ టోర్నీల్లో పాల్గొనకుండా ఆమెను అనర్హురాలిగా ప్రకటించింది.

నోటీసులోని అంశాలు ….

యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ (UWW) యాంటీ-డోపింగ్ నిబంధనల ప్రకారం …. రిటైర్మెంట్ తర్వాత మళ్లీ పోటీల్లోకి దిగాలంటే అథ్లెట్లు కనీసం ఆరు నెలల ముందుగా సమాచారం ఇవ్వాలి. వినేశ్ ఈ నిబంధనను పాటించలేదని డబ్ల్యూఎఫ్‌ఐ పేర్కొంది. 2024 పారిస్ ఒలింపిక్స్‌లో బరువు నిబంధనల కారణంగా అనర్హతకు గురై దేశ ప్రతిష్టను దెబ్బతీశారని నోటీసులో ఆరోపించింది. యాంటీ – డోపింగ్ టెస్ట్ నిబంధనల్లో భాగంగా తన వివరాలు తెలపడంలో విఫలమయ్యారని పేర్కొంది. మార్చి 2024లో అప్పటి ఐఓఏ తాత్కాలిక కమిటీ నిర్వహించిన ఎంపిక ట్రయల్స్‌లో నిబంధనలకు విరుద్ధంగా రెండు వేర్వేరు బరువు విభాగాల్లో పాల్గొనడాన్ని తప్పుబట్టింది. ఈ ఆరోపణలపై వివరణ ఇచ్చేందుకు వినేష్ కు డబ్ల్యూఎఫ్‌ఐ 14 రోజుల గడువు ఇచ్చింది.

​డబ్ల్యూఎఫ్‌ఐ vs వినేశ్ ….

తన పునరాగమనాన్ని అడ్డుకునేందుకే డబ్ల్యూఎఫ్‌ఐ ఉద్దేశపూర్వకంగా ఇలా చేస్తోందని వినేష్ ఆరోపించగా, సమాఖ్య ఆ వాదనలను తోసిపుచ్చింది. రాబోయే ఆసియా క్రీడల ఎంపిక ట్రయల్స్‌కు సైతం ఆమె దూరమైంది. 2025, 2026లో పతకాలు సాధించిన వారే ట్రయల్స్‌కు అర్హులని డబ్ల్యూఎఫ్‌ఐ నిబంధనలు మార్చడంతో.. పారిస్ ఒలింపిక్స్ తర్వాత ఎలాంటి పోటీల్లో పాల్గొనే అర్హతను వినేష్ కోల్పోయారు.

వినేష్‌‌పై కక్షసాధింపు!

భారత రెజ్లింగ్‌ ‌సమాఖ్య మహిళా క్రీడాకా రులపై లైంగిక వేధింపులకు పాల్పడు తున్నారని ఆరోపిస్తూ ఢిల్లీలో గతంలో చేపట్టిన ఆందోళనలో వినేష్‌ ‌పాల్గొన్న సంగతి తెలిసిందే. వారికి న్యాయం చేయకపోగా, అణచివేసేందుకు కేంద్రం ప్రయత్నిం చిన సంగతి తెలిసిందే. అందులో భాగంగానే ఆమెపై కక్షసాధింపు చర్యలకు రెజ్లింగ్‌ ‌సమాఖ్య దిగిందని పలువురు విమర్శిస్తున్నారు.vinesh phogot

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్