test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

జాతీయ తైక్వాండో పోటీల్లో విజయనగరం క్రీడాకారుల ప్రభంజనం

20 మే, 2026

Vizianagaram athletes excel in the National Taekwondo Competitions
వెబ్ డెస్క్

ప్రచురించబడింది మే 20, 2026, 04:42 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • 16 గోల్డ్ మెడల్స్‌తో ఘన విజయం

ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : తెలంగాణ రాష్ట్రం గద్వాల్ జిల్లా బృందావన్ గార్డెన్స్‌లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఓపెన్ నేషనల్ తైక్వాండో ఛాంపియన్‌షిప్‌లో విజయనగరం జిల్లా క్రీడాకారులు అద్భుత ప్రతిభ కనబరిచి పతకాల పంట పండించారు. మే 15, 16, 17 తేదీలలో మూడు రోజుల పాటు జరిగిన ఈ జాతీయ స్థాయి పోటీలలో జిల్లా జట్టు తమ మేటి నైపుణ్యంతో ఏకంగా 16 బంగారు, 9 వెండి, 1 కాంస్య పతకాలను కైవసం చేసుకుని సరికొత్త రికార్డు సృష్టించింది. ​ఈ పోటీల్లో ఎన్. హర్షిణి, టి. నాగ సాయి జతిన్, వై. ముకేష్ విశ్వనాథ్, వి. రోహిణి సత్యలు అసాధారణ ప్రతిభ కనబరిచి ప్రతీ ఒక్కరూ రెండు గోల్డ్ మెడల్స్ సాధించారు. అలాగే డి. ప్రియవల్లి, డి. కార్తికేయ, ఎస్. గగన్, ఆర్. పూర్ణ చంద్రు, వై. చరిష్మా, టి. సాంకీర్తన, ఎస్. సత్విక్, డి. ధనీష్‌లు ఒక్కో బంగారు పతకాన్ని సాధించి జిల్లా కీర్తిని జాతీయ స్థాయిలో చాటారు. ఎం. భావ్య శ్రీ, పి. సహస్ర సమ్హిత, డి. ప్రియవల్లి, ఎ. ముకేష్ మనికంఠ, టి. మేఘనా శ్రీ, ఆర్. తేజ శ్రీ, జి. ఫలక్ కుమార్, జి. తరుణ్, డి. ధనేష్‌లు ప్రతిభ చాటి రజత పతకాలను సొంతం చేసుకోగా, కాంస్య (బ్రోంజ్) పతకాన్ని ఎస్. సత్విక్ సాధించారు. ​జాతీయ స్థాయిలో విజయనగరం పేరును మారుమోగించిన క్రీడాకారులను విజయనగరం జిల్లా తైక్వాండో అసోసియేషన్ అధ్యక్షులు గురాన అయ్యలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తైక్వాండో అసోసియేషన్ కార్యదర్శి సిహెచ్.వేణుగోపాలరావు ప్రత్యేకంగా అభినందించారు. క్రీడాకారులను ఇంతటి ఉన్నత స్థాయికి తీర్చిదిద్దిన కోచ్‌లు యశస్విని, చైతన్యల కృషిని వారు కొనియాడారు. విజేతలైన క్రీడాకారులు భవిష్యత్తులో మరిన్ని అంతర్జాతీయ విజయాలు సాధించి, దేశానికి కీర్తి తీసుకురావాలని వారు ఆకాంక్షించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్