సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ
సింగపూర్: సింగపూర్ ఓపెన్ పురుషుల డబుల్స్ ఫైనల్లోకి భారత జంట ప్రవేశించింది. ఈ ఏడాది అద్భుత ఫామ్ లో ఉన్న భారత డబుల్స్ ద్వయం శనివారం జరిగిన సెమీస్ లో టాప్ సీడ్ జంటను చిత్తుచేసి తుదిపోరుకు అర్హత సాధించారు. హోరాహోరీగా సాగిన సెమీస్ లో 4వ సీడ్ సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి 21-19, 21-18తో టాప్ సీడ్, కొరియాకు చెందిన కిమ్ హో, సియావో జంటను చిత్తుచేశారు. ఆదివారం జరిగే ఫైనల్లో భారత ద్వయం రెండో సెమీస్ విజేతతో తలపడనున్నారు. ఇక మిక్స్ డ్ డబుల్స్ లో భారత జంట మూడుసెట్ల హోరాహోరీ పోరులో ఓటమిపాలయ్యారు. అన్ సీడెడ్ గా బరిలోకి దిగిన భారత జంట సెమీస్ లో 16-21, 21-17, 13-21తో జపాన్ జంట షిమోగామీ-హొబరా జంట చేతిలో ఓడారు. ఇక మహిళల సింగిల్స్ ఫైనల్లోకి 3వ సీడ్, జపాన్ కు చెందిన అర్యానా యమగుచి ప్రవేశించింది. హోరాహోరీగా సాగిన సెమీస్ లో యమగుచి 21-13, 17-21, 21-15తో చైనాకు చెందిన 2వ సీడ్ వాంగ్ జీ ను ఓడించింది. మరో పోటీలో టాప్ సీడ్, కొరియాకు చెందిన అన్-సే యంగ్ 20-22, 21-12, 21-15తో 4వ సీడ్, చైనాకు చెందిన చెన్-యూఫీని చిత్తుచేసి ఫైనల్ కు చేరింది.









కామెంట్‌లు (0)