నార్వే చెస్ టోర్నీ
ఓస్లో: యువ గ్రాండ్‌మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద టాప్ సీడ్ కార్ల్ సన్ కు మళ్లీ షాక్ ఇచ్చాడు. నార్వే చెస్ టోర్నీలో స్థానిక ఆటగాడు, ప్రపంచ నెంబర్ వన్ ప్లేయర్ మ్యాగ్నస్ కార్ల్‌సన్‌పై వరుసగా రెండోసారి విక్టరీ కొట్టాడు. మరోవైపు వరల్డ్ చాంపియన్ డి గుకేశ్ 8వ రౌండ్ గేమ్‌లో ఫ్రెంచ్ గ్రాండ్‌మాస్టర్ అలిరేజా ఫిరౌజా చేతిలో ఓటమి పాలయ్యాడు. దీంతో పాయింట్ల పట్టికలో గుకేశ్ అట్టడుగు స్థానంలో నిలిచాడు. అయిదు సార్లు ప్రపంచ చాంపియన్ కార్ల్‌సన్ కేవలం 9 పాయింట్లే సాధించాడు. ఇక ప్రజ్ఞానంద చేతిలో మూడు సార్లు కార్ల్‌సన్ ఓడినట్లైంది. క్లాసికల్ గేమ్‌లో ఈ ఏడాది కార్ల్‌సన్‌పై రెండు సార్లు గెలిచిన ప్లేయర్‌గా ఇండియన్ స్టార్ నిలిచాడు. ఈ టోర్నీలో ఇంకా రెండు రౌండ్లు మిగిలి ఉన్నాయి. 20 ఏళ్ల ప్రజ్ఞానంద 12 పాయింట్లతో ప్రస్తుతం మూడవ స్థానంలో ఉన్నాడు. అలీరేజా 13 పాయింట్లతో రెండో స్థానంలో, అమెరికన్ గ్రాండ్‌మాస్టర్ వెస్లే సో 14 పాయింట్లతో ప్రథమ స్థానంలో ఉన్నాడు.









కామెంట్‌లు (0)