test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ప్రి క్వార్టర్స్ కు ఒసాకా, సబలెంక

30 మే, 2026

teniss
వెబ్ డెస్క్

ప్రచురించబడింది మే 30, 2026, 11:17 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టోర్నీ

పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ ప్రి క్వార్టర్ ఫైనల్లోకి జపాన్ కు చెందిన ఒసాకా, టాప్ సీడ్, అర్యానా సబలెంక ప్రవేశించారు. శనివారం జరిగిన మూడోరౌండ్ పోటీలో ఒసాకా మూడుసెట్ల హోరా హోరీ పోరులో అమెరికా యువ సంచలనం ఇవియ జోవిక్ ను, సబలెంక(బెలారస్) వరుససెట్లలో ఆస్ట్రేలియాకు చెందిన కసట్కినాను ఓడించారు. 16వ సీడ్ ఒసాకా 7-6(7-5), 6-7(3-7), 6-4తో 17వ సీడ్ ఇవియను, సబలెంక 6-0, 7-5తో కసట్కినాను చిత్తు చేసింది. ఇక అన్ సీడెడ్ చ్వాలిన్కా(పోలండ్) 1-6, 6-3, 6-2తో సక్కారి(గ్రీక్)ను, 25వ సీడ్ షణైదర్ 7-5, 6-1తో ఒలియన్కోవా(ఉక్రెయిన్)ను ఓడించారు. మరో పోటీలో 6వ సీడ్ అనిసిమోవా అనూహ్యంగా అన్ సీడెడ్ పారీ చేతిలో 3-6, 4-6తో ఓటమిపాలయ్యారు. మరో పోటీలో 22వ సీడ్ కనస్కియా(రష్యా) 6-3, 2-6, 6-2తో అన్ సీడెడ్ ఒసోరియా(కొలంబియా) ను ఓడించి ప్రి క్వార్టర్స్ కు చేరారు. జ్వెరేవ్, కోబలి కూడా… పురుషుల సింగిల్స్ ప్రి క్వార్టర్ ఫైనల్లోకి 2వ సీడ్ జ్వెరేవ్(జర్మనీ), 10వ సీడ్, కోబలి(ఇటలీ) ప్రవేశించారు. శనివారం జరిగిన మూడోరౌండ్ పోటీలో జ్వెరేవ్ 6-4, 6-3, 5-7, 6-2తో క్యూ హేలిస్(ఫ్రాన్స్)ను, కోబలి 6-2, 6-2, 6-3తో 18వ సీడ్, అమెరికాకు చెందిన టియన్ ను ఓడించారు. ఇక 25వ సీడ్ సెరుండోలో ఐదు సెట్ల హోరా హోరీ పోరులో అన్ సీడెడ్ (స్వజ్జా) చేతిలో పోరాడి ఓడాడు. ఉత్కంఠభరితంగా సాగిన ఈ గేమ్? లో సెరుండోలో 3-6, 4-6, 6-3, 6-4, 3-6తో స్వజ్జా చేతిలో పరాజయాన్ని చవిచూశాడు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్