ఐపిఎల్ : ఐపిఎల్ 2026లో ప్లేఆఫ్స్ రేసును మరింత ఉత్కంఠభరితంగా మార్చే మ్యాచ్‌కు వాంఖడే స్టేడియం వేదికైంది. తప్పక గెలవాల్సిన పరిస్థితిలో ఉన్న రాజస్థాన్ రాయల్స్, ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్రమించిన ముంబై ఇండియన్స్‌తో తలపడుతోంది. టాస్ గెలిచిన ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్య ముందుగా బౌలింగ్ ఎంచుకోగా, రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్‌కు దిగనుంది.
టాస్ అనంతరం హార్దిక్ మాట్లాడుతూ …. వాంఖడే పిచ్ సాయంత్రం సమయంలో బ్యాటింగ్‌కు మరింత అనుకూలంగా మారుతుందని భావించి ఛేజింగ్‌నే ఎంచుకున్నామని తెలిపాడు. ఈ సీజన్ తమకు ఆశించిన విధంగా సాగకపోయినా, చివరి మ్యాచ్‌ను విజయంతో ముగించాలని జట్టు లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పాడు. విశ్రాంతి కారణంగా జస్‌ప్రీత్ బుమ్రా ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడని, అతని స్థానంలో శార్దూల్ ఠాకూర్‌కు అవకాశం ఇచ్చామని వెల్లడించాడు.
ఇక రాజస్థాన్ కెప్టెన్ రియాన్ పరాగ్ మాట్లాడుతూ …. తాము కూడా టాస్ గెలిచినా బౌలింగ్‌నే ఎంచుకునేవాళ్లమని తెలిపాడు. ఈ మ్యాచ్ గెలిస్తే ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడకుండా నేరుగా ప్లేఆఫ్స్‌కు అర్హత సాధిస్తామని పేర్కొన్నాడు. కీలక పోరుకు జట్టులో మూడు మార్పులు చేశామని, నాండ్రే బర్గర్‌తో పాటు రవీంద్ర జడేజా తిరిగి జట్టులో చేరినట్లు వెల్లడించాడు.
పంజాబ్ కింగ్స్ నిన్నటి విజయంతో రాజస్థాన్‌పై ఒత్తిడి మరింత పెరిగింది. ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలంటే ఈ మ్యాచ్‌లో విజయం తప్పనిసరి. మరోవైపు, ఇప్పటికే టోర్నీ నుంచి బయటపడిన ముంబై ఇండియన్స్ తమ అభిమానులకు విజయంతో వీడ్కోలు పలకాలని చూస్తోంది.
ముంబై ఇండియన్స్ జట్టు ….
ర్యాన్ రికెల్టన్, నమన్ ధీర్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్య, విల్ జాక్స్, కార్బిన్ బాష్, దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్, ఏఎం ఘజన్‌ఫర్, రఘు శర్మ.
రాజస్థాన్ రాయల్స్ జట్టు …
యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, ధ్రువ్ జురెల్, రియాన్ పరాగ్, డొనోవన్ ఫెరీరా, శుభమ్ దూబే, దాసున్ శనక, జోఫ్రా ఆర్చర్, నాండ్రే బర్గర్, యశ్ రాజ్ పుంజా, బ్రిజేష్ శర్మ.









కామెంట్‌లు (0)