తొలిరౌండ్ లోనే ఓడిన మాల్విక, శ్రీకాంత్ ఇండోనేషియా ఓపెన్
జకార్తా: ఇండోనేషియా ఓపెన్ లో పివి సింధు శుభారంభం చేసింది. మంగళవారం జరిగిన తొలి రౌండ్ పోటీలో సింధు వరుససెట్లలో థాయ్ లాండ్ కు చెందిన బుసానన్ ఒంగ్ మ్రుంగ్ఫన్ ఓడించింది. తొలి గేమ్ లో గట్టి పోటీనిచ్చినా ఆ సెట్‌ను 25-23తో గెలిచిన సింధు.. రెండో సెట్‌లో దూకుడుగా ఆడి 21-16తో చేజిక్కించుకొని ప్రి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. ప్రి క్వార్టర్స్ లో వరల్డ్ నంబర్ 1 అన్ సే యంగ్(దక్షిణ కొరియా)ను ఢీకొట్టనుంది. ఇక రెండుసార్లు ఒలింపిక్ విజేతగా చరిత్ర సృష్టించిన పివి సింధు చాలా రోజులకు టాప్-10 ర్యాంక్ కు ఎగబాకింది. గత రెండేళ్లుగా పలు టోర్నీల్లో క్వార్టర్స్, సెమీస్‌లోనే నిష్క్రమిస్తున్న తెలుగు తేజం.. ఇండోనేషియా ఓపెన్ సూపర్ 1000లో విజయంతో పదో ర్యాంక్ పట్టేసింది. జూన్ 1 సోమవారం ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బిడబ్ల్యుఎఫ్) ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో సింధు 11వ స్థానంలో నిలిచింది. మంగళవారం వరస సెట్లలో థాయ్‌లాండ్ షట్లర్‌ను ఓడించడం ద్వారా ఒక స్థానం ఎగబాకి పదో ర్యాంక్‌ను సొంతం చేసుకుంది.
ఇక పురుషుల సింగిల్స్ లో కిదాంబి శ్రీకాంత్, లక్ష్యసేన్ తొలి రౌండ్ లోనే ఓటమిపాలయ్యారు. కిదాంబి శ్రీకాంత్ 19-21, 15-21తో జపాన్ కు చెందిన టనాకా చేతిలో ఓటమిపాలయ్యాడు. మరో మ్యాచ్ లో లక్ష్యసేన్ 19-21, 16-21తో ఫర్హాన్(ఇండోనేషియా) చేతిలో ఓడాడు. పురుషుల డబుల్స్ లో హంసకరణ్-అర్జున్ జంట 21-18, 21-10తో మలేషియా జంటను చిత్తుచేయగా.. మిక్స్ డ్ డబుల్స్ లో త్రీసా జోలీ-పుల్లెల గోపీచంద్ జంట 14-21, 12-21తో ఇండోనేషియా జంట చేతిలో ఓడారు. ఇక మిక్స్ డ్ డబుల్స్ లో తానీసా కాస్ట్రో-ధృవ్ కపిల జంట 11-21, 10-21తో 6వ సీడ్, చైనా జంట చేతిలో చిత్తుగా ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించారు.









కామెంట్‌లు (0)