సింధు, ఆయుశ్ ఓటమి
బ్యాంకాక్: ఇండోనేషియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ సింగిల్స్ లో భారత షట్లర్ల పోరాటం ముగియగా.. పురుషుల డబుల్స్ లో హంసకరుణన్-అర్జున్ జంట క్వార్టర్ ఫైనల్ కు చేరారు. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రి క్వార్టర్ ఫైనల్లో సింధు 17-21, 16-21తో టాప్ సీడ్, కొరియాకు చెందిన సన్-యే-యంగ్ చేతిలో పోరాడి ఓడింది. ఇక పురుషుల సింగిల్స్ లో ఆయుశ్ శెట్టి మూడుసెట్ల హోరా హోరీ పోరులో లీ-సివై(హాంకాంగ్) చేతిలో పోరాడి ఓడాడు. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ గేమ్ లో ఆయుశ్ శెట్టి 21-16, 13-21, 14-21తో ఓటమిపాలయ్యాడు. ఇక పురుషుల డబుల్స్ లో అర్జున్-హంసకరుణన్ జంట 16-21, 21-15, 21-19తో మలేషియాకు చెందిన కాంగ్-టాయ్ జంటను చిత్తు చేసి క్వార్టర్ ఫైనల్ కు చేరారు. ఇక మిక్స్ డ్ డబుల్స్ లో రోహన్ కపూర్-గద్దె రిత్విక జంట 13-21, 12-21తో 4వ సీడ్ ఫ్రాన్స్ జంట చేతిలో వరుససెట్లలో ఓడారు.









కామెంట్‌లు (0)