mh ad
శుక్రవారం, 19 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

IND A vs AFG A : ఆఫ్ఘనిస్థాన్‌ A తో కీలక పోరు – భారత్‌ A బ్యాటింగ్

2 రోజుల క్రితం

IND A vs AFG A: Crucial clash against Afghanistan A – India A batting.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 17, 2026, 01:03 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

శ్రీలంక : శ్రీలంక వేదికగా జరుగుతున్న ముక్కోణపు సిరీస్‌లో ఫైనల్‌ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే భారత్‌ A జట్టుకు ఆఫ్ఘనిస్థాన్‌ A పై విజయం తప్పనిసరి. ఈ నేపథ్యంలో జరిగిన టాస్‌లో ఆఫ్ఘనిస్థాన్‌ A కెప్టెన్‌ విజయం సాధించి ముందుగా బౌలింగ్‌ ఎంచుకున్నాడు. దీంతో భారత్‌ A జట్టు బ్యాటింగ్‌ ప్రారంభించింది. ప్రస్తుతం భారత్‌ A మూడు మ్యాచ్‌ల్లో ఒక విజయం, రెండు పరాజయాలతో పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది. మరోవైపు ఆఫ్ఘనిస్థాన్‌ A రెండు మ్యాచ్‌ల్లో ఒక విజయం, ఒక ఓటమితో మూడో స్థానంలో ఉంది. దీంతో ఇరు జట్లకూ ఈ మ్యాచ్‌ అత్యంత కీలకంగా మారింది.

భారత్‌ A జట్టు : ప్రియాంశ్‌ ఆర్య, వైభవ్‌ సూర్యవంశీ, రుతురాజ్‌ గైక్వాడ్, తిలక్‌ వర్మ (కెప్టెన్‌), కుమార్‌ కుషాంగ్రా (వికెట్‌ కీపర్‌), నిషాంత్‌ సింధు, సూర్యాంశ్‌ షెడ్జే, విప్రాజ్‌ నిగమ్‌, అనుకుల్‌ రాయ్‌, అన్షుల్‌ కాంబోజ్‌, యశ్‌ ఠాకూర్‌.

ఆఫ్ఘనిస్థాన్‌ A జట్టు : ఇమ్రాన్‌ మిర్‌ (కెప్టెన్‌), హస్సన్‌ ఇసాఖిల్‌, ఖలిద్‌ తనివాల్‌, బహిర్‌ షా, ఫర్మానుల్లా సాఫి, షామ్స్‌ ఉర్‌ రహ్మాన్‌, మహ్మద్‌ ఇషాక్‌ (వికెట్‌ కీపర్‌), జహిర్‌ ఖాన్‌, అబ్దుల్లా అహ్మద్జాయ్‌, ఫైసల్‌ ఖాన్‌, ఫరీదూన్‌ దావూద్‌జాయ్‌.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్