test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print EditionFrench Open: స్వైటెక్‌కు షాక్‌

31 మే, 2026

tennis
వెబ్ డెస్క్

ప్రచురించబడింది మే 31, 2026, 10:46 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  •  ఫ్రెంచ్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ ప్రీ క్వార్టర్స్‌లో ఓటమి

పారిస్‌ (ఫ్రాన్స్‌) : ఫ్రెంచ్‌ ఓపెన్‌లో సంచలనాల మోత మోగుతోంది. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ కొకొ గాఫ్‌ పోటీ నుంచి నిష్ర్కమించగా, నాలుగు సార్లు ఛాంపియన్‌ ఇగా స్వైటెక్ (పొలాండ్‌) సైతం రేసు నుంచి తప్పుకుంది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్‌ నాల్గో రౌండ్‌ మ్యాచ్‌లో ఇగా స్వైటెక్‌ వరుస సెట్లలో ఓటమి పాలైంది. 15వ సీడ్‌, ఉక్రెయిన్‌ అమ్మాయి మార్టా కోస్టియుక్‌ 7-5, 6-1తో స్వైటెక్‌కు దిమ్మదిరిగే షాక్‌ ఇచ్చింది. ఒక గంట 40 నిమిషాల పాటు సాగిన ప్రీ క్వార్టర్స్‌లో ఆరంభం నుంచీ ఉక్రెయిన్‌ అమ్మాయి ఆకట్టుకునే ప్రదర్శన కనబరిచింది. ఐదు ఎస్‌లు, ఆరు బ్రేక్‌ పాయింట్లతో మెరిసిన మార్టా 25 విన్నర్లు కొట్టింది. స్వైటెక్‌ ఐదు డబుల్‌ ఫాల్ట్స్‌కు పాల్పడటంతో పాటు మూడు బ్రేక్‌ పాయింట్లే సాధించింది. తొలి సెట్‌ నువ్వా నేనా అన్నట్టు సాగినా.. రెండో సెట్‌ను మార్టా ఏకపక్షంగా సొంతం చేసుకుంది. పాయింట్ల పరంగా 79-57తో ఉక్రెయిన్‌ క్రీడాకారిణి పైచేయి సాధించింది. మరో మ్యాచ్‌లో రోమానియా ప్లేయర్‌ సొరానా 6-3, 7-6(7-4)తో చైనా అమ్మాయి వాంగ్‌పై వరుస సెట్లలో గెలుపొంది క్వార్టర్స్‌ ఫైనల్‌కు చేరుకుంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్