test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print EditionFrench Open: సెమీస్ కు ఆండ్రీవా, కోస్ట్యూక్

5 రోజుల క్రితం

French Open: Andreeva, Kostyuk Advance to Semis
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 03, 2026, 12:05 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

  • ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టోర్నీ

పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ లో సంచలనాలు నమోదవుతున్నాయి. మంగళవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో 8వ సీడ్, ఆండీవా(రష్యా) 6-0, 6-3తో 18వ సీడ్ రొమేనియాకు చెందిన సిర్సియాను చిత్తుచేయగా.. మరో పోటీలో 15వ సీడ్ ఉక్రెయిన్ కు చెందిన కోస్ట్యూక్ మూడు సెట్ల హోరా హోరీ పోరులో ఏకంగా 7వ సీడ్ స్విటోలినాను ఓడించి సెమీస్ కు చేరింది. కోర్టు ఫిలిప్ లో జరిగిన ఈ మ్యాచ్ లో కోస్ట్యూక్ 6-3, 2-6, 6-2తో స్విటోలినా(ఉక్రెయిన్)ను ఓడించింది. ఇక క్వార్టర్ ఫైనల్లోకి టాప్ సీడ్, బెలారస్ కు చెందిన అర్యానా సబలెంకా చోటు దక్కించుకుంది. చివరి ప్రి క్వార్టర్స్ లో సబలెంక వరుససెట్లలో జపాన్ కు చెందిన నవోమీ ఒసాకాను చిత్తు చేసింది. హోరాహోరీగా సాగిన ఈ పోరులో సబలెంక 7-5, 6-3తో మ్యాచ్ ను ముగించి మరో ప్రి క్వార్టర్స్ లో డయానా(బెలారస్) 6-3, 3-6, 6-0తో అమెరికాకు చెందిన కీస్ను చిత్తుచేసింది.

ఇక పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లోకి 2వ సీడ్, జర్మనీకి చెందిన అలెగ్జాండర్ జ్వెరేవ్ ప్రవేశించాడు. మంగళవారం జరిగిన తొలి క్వార్టర్ ఫైనల్లో జ్వెరేవ్ వరుససెట్లలో 27వ సీడ్, స్పెయిన్ కు చెందిన రఫెల్ జోడర్ ను ఓడించాడు. ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్ లో జ్వెరేవ్ 7-6(7-3), 6-1, 6-3తో జోడర్ ను చిత్తు చేసి సెమీస్ కు చేరాడు. బ్రెజిల్‌ టీనేజర్‌ జోవో ఫొన్సెకా సంచలన ప్రదర్శన కొనసాగుతోంది. మూడో రౌండ్‌లో సెర్బియా దిగ్గజం నొవాక్‌ జొకోవిచ్‌ను బోల్తా కొట్టించిన 19 ఏళ్ల ఫొన్సెకా… ప్రిక్వార్టర్‌ ఫైనల్లో 15వ సీడ్, ఫ్రెంచ్‌ ఓపెన్‌లో రెండుసార్లు రన్నరప్‌గా నిలిచిన కాస్పర్‌ రూడ్‌ను ఓడించాడు. తద్వారా తన కెరీర్‌లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో క్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. 3 గంటల 55 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఫొన్సెకా 7–5, 7–6 (10/8), 5–7, 6–2తో రూడ్‌పై గెలిచాడు. 11వ సీడ్‌ ఆండ్రీ రుబ్లెవ్‌ (రష్యా) కూడా ప్రిక్వార్టర్‌ ఫైనల్లోనే ఇంటిముఖం పట్టాడు. రుబ్లెవ్‌ 3–6, 6–7 (6/8), 6–4, 6–2, 3–6తో మెన్‌సిక్‌ (చెక్‌ రిపబ్లిక్‌) చేతిలో ఓడిపోయాడు. ఇక బెరెటిని(స్పెయిన్) 6–3, 7–6 (7/2), 7–6 (8/6)తో యువాన్‌ మాన్యుయెల్‌ సెరున్‌డొలో (అర్జెంటీనా)పై గెలిచి క్వార్టర్స్ కు చేరాడు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్