test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ప్రి క్వార్టర్స్ కు ఆయుశ్

4 రోజుల క్రితం

Ayush advances to Indonesia Open pre-quarters
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 03, 2026, 11:26 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • తొలిరౌండ్ లోనే ఓడిన ఉన్నతి, సాత్విక్-చిరాగ్

  • ఇండోనేషియా ఓపెన్

బ్యాంకాక్: ఇండోనేషియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత షట్లర్లకు మిశ్రమ ఫలితాలు దక్కాయి. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ లో ఆయుశ్ శెట్టి శుభారంభం చేయగా.. మహిళల సింగిల్స్ లో ఉన్నతి హుడా, పురుషుల డబుల్స్ లో సాత్విక్-చిరాగ్ జంట ఓటమిపాలయ్యారు. తొలిరౌండ్ లో ఆయుశ్ 8-21, 22-20, 21-15తో వాంగ్(చైనా)పై మూడుసెట్ల హోరా హోరీ పోరులో చిత్తు చేశాడు. ఇక హెచ్ ఎస్ ప్రణయ్ 17-21, 21-16, 19-21తో నుయేన్(ఐర్లాండ్) చేతిలో పోరాడి ఓడాడు. పురుషుల డబుల్స్ లో 4వ సీడ్ సాత్విక్-చిరాగ్ 6-11తో వెనుకబడి ఉన్న దశలో గాయం కారణంగా టోర్నీ నుంచి నిష్క్రమించారు. ఇక మిక్స్ డ్ డబుల్స్ లో ఆర్.కపూర్-గద్దె జంట 21-14, 21-14తో చైనీస్ తైపీ జంటను ఓడించి ప్రి క్వార్టర్స్ కు చేరారు. ఇక మహిళల సింగిల్స్ లో ఉన్నతి హుడా 15-21, 14-21తో ఒకుహరా(జపాన్) చేతిలో వరుససెట్లలో ఓడారు. ఇక మహిళల సింగిల్స్ లో పివి సింధు శుభారంభం చేయగా.. లక్ష్యసేన్ తొలిరౌండ్ లోనే ఓటమిపాలైన సంగతి తెలిసిందే.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్