test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

విజయోత్సవ వేడుకల్లేవు

6 రోజుల క్రితం

ipl
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 02, 2026, 12:12 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

  • బెంగళూరు: 2026 ఐపిఎల్ టైటిల్ ను వరుసగా రెండోసారి కైవసం చేసుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) యాజమాన్యం మరోసారి విజయోత్సవ వేడుకలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. 2025 సీజన్ లో 17ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ తొలిసారి బెంగళూరు ఐపిఎల్ టైటిల్ కైవసం చేసుకొని ఫుల్ జోష్ లో ఉన్న దశలో చిన్నస్వామి స్టేడియం వద్ద అభిమానుల జనసంద్రోహం మధ్య జరిగిన తొక్కిస లాటలో సుమారు 11 మంది చనిపోవడంతోపాటు దాదాపు 50మంది త్రీవ గాయాల బారిన పడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వరుసగా రెండోసారి టైటిల్ ను కైవసం చేసుకున్నా.. మరోసారి విజయోత్సవ వేడుకలకు దూరంగా ఉండాలని సోమవారం విడుదల చేసింది. అభిమానులెవ్వరూ బయటికి రావొద్దని అందరూ ఇళ్లల్లో కుటుంబ సభ్యులతో ఉండాలని తాజాగా ప్రకటించింది. ఇక ఆర్సీబీ వరుస రెండు సీజన్లలో ఐపిఎల్ టైటిల్ గెలిచిన మూడో జట్టుగా నిలిచింది. ఇంతకుముందు చెన్నై(2010, 2011), ముంబయి(2019, 2020) వరుసగా రెండుసార్లు టైటిళ్లను ముద్దాడాయి. కగిసో రబడా(29వికెట్లు) అత్యధిక వికెట్లు పర్పుల్ క్యాంప్ ను అందుకోగా.. 15ఏళ్ల రాజస్తాన్ రాయల్స్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ(776 పరుగులు) ఆరెంజ్ క్యాప్ అవార్డులు అందుకున్నారు.

బెంగళూరు పోలీసులు కీలక నిర్ణయం
మరోవైపు ఆర్సీబీ ఐపీఎల్ 2026 టైటిల్ గెలిచిన నేపథ్యంలో బెంగళూరు పోలీసులు కీలక సూచనలు జారీ చేశారు. అభిమానులు బెంగళూరులో రోడ్ల మీద గుమిగూడకూడదని, సంబరాల్లో భాగంగా బాణసంచా కాల్చకూడదని, జనజీవనానికి ఏ విధమైన ఆటంకమూ కలిగించరాదని సూచించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించకూడదని, బహిరంగ ప్రదేశాల్లో వేడుకలు నిర్వహించుకోవడానికి అనుమతి లేదని స్పష్టం చేశారు. ఎవరైనా సంబరాలు నిర్వహించుకోవాలనుకుంటే.. ఇళ్లలోనే చేసుకోవాలని సూచించారు. ఇక ఆర్సీబీ ఫ్రాంచైజీ కూడా కీలక నిర్ణయం తీసుకుంది. విదేశీ ఆటగాళ్లు జోష్‌ హేజిల్‌ వుడ్‌, టిమ్‌ డేవిడ్‌, జాకబ్‌ డఫీ, రొమారియో షెఫర్డ్‌ తదితర అంతర్జాతీయ ఆటగాళ్లు తమ తమ జాతీయ జట్టులో చేరాల్సి ఉంది. దానికి తోడు ఈ వారంలోనే భారత్, అఫ్ఘానిస్థాన్ టెస్ట్ మ్యాచ్ కూడా జరగనుంది. దేవ్‌దత్‌ పడిక్కల్‌ ఇందుకోసం భారత జట్టులో చేరనున్నాడు. ఈ నేపథ్యంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. విజయోత్సవ ర్యాలీ చేపట్టకూడదని నిర్ణయించింది.

వైభవ్ సూర్యవంశీకి ఐదు అవార్డులు
ఐపిఎల్ అవార్డుల కార్యక్రమంలో రాజస్తాన్ రాయల్స్ 15ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ప్రధాన ఆకర్షణగా నిలిచాడు. అతడు ఏకంగా 5 అవార్డులను అందుకొని అందరి దృష్టిని ఆకర్షించాడు. 2026 ఐపిఎల్ సీజన్ లో అత్యధికంగా 776 పరుగులు కొట్టినందుకు ఆరెంజ్ క్యాప్ అందుకున్నాడు. అలాగే ఎమర్జింగ్ ప్లేయర్, మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్, ఉత్తమ స్ట్రైక్ రేట్ మరియు అత్యధిక సిక్సర్ల అవార్డులను అందుకున్నాడు. ఐపిఎల్ చరిత్రలోనే ఒక సీజన్ లో అత్యధిక సిక్సర్ల రికార్డు క్రిస్ గేల్(59) 14ఏళ్ల రికార్డును తాజాగా బ్రేక్ చేశాడు. ఈ సీజన్ లో సూర్యవంశీ ఏకంగా 72 సిక్సర్లు బాది రికార్డు పుటల్లోకెక్కాడు.

రూ.46కోట్ల ప్రైజ్ మనీ: బిసిసిఐ
2026 సీజన్ ప్లే-ఆఫ్స్ 4 మ్యాచులకే రూ.46కోట్ల ప్రైజ్ మనీ పంపకం చేసినట్లు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బిసిసిఐ) సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. టైటిల్ విజేత బెంగళూరుకు రూ.20కోట్లు, రన్నరప్ గుజరాత్ కు రూ.12.5కోట్లు ప్రైజ్ మనీ అందజేసినట్లు తెలిపింది. అలాగే ప్లే-ఆఫ్స్ లో ఓడిన రాజస్తాన్ కు రూ.7.5కోట్లు, సన్ రైజర్స్ హైదరాబాద్ కు రూ.6కోట్లు చొప్పున ముట్టజెప్పినట్లు తెలిపింది.

 

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్