చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో గత కొద్దిరోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత, ప్రముఖ నటుడు విజయ్ ఆ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఈ మేరకు రేపు (ఆదివారం) మధ్యాహ్నం 3 గంటలకు చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో ఆయన ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. శనివారం చోటుచేసుకున్న కీలక పరిణామాల్లో భాగంగా.. విజయ్ చెన్నైలోని లోక్‌భవన్‌లో ఇన్‌చార్జ్ గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్‌ను కలిశారు. తన వద్ద 120 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని తెలుపుతూ, దానికి సంబంధించిన లేఖలను గవర్నర్‌కు అందజేశారు. రాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 234 స్థానాలు ఉండగా, ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మేజిక్ ఫిగర్ 118. ప్రస్తుతం టీవీకేకు వీసీకే మరియు ఐయూఎంఎల్ పార్టీలు కూడా మద్దతు ప్రకటించడంతో విజయ్ బలం 120కి చేరింది. విజయ్‌తో భేటీ కోసమే గవర్నర్ తన కేరళ పర్యటనను కూడా రద్దు చేసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎన్నికల ఫలితాల అనంతరం ఆయన గవర్నర్‌ను కలవడం ఇది నాలుగోసారి.
ఉత్కంఠకు తెర.. రేపే విజయ్ ప్రమాణ స్వీకారం!
11 మే, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది మే 11, 2026, 12:14 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం








కామెంట్‌లు (0)