mh ad
శుక్రవారం, 19 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

నేటి నుండి ప్రారంభమైన పాఠశాలలు.. విద్యార్థులకు సిఎం విజయ్ శుభాకాంక్షలు

04 జూన్, 2026

CM Vijay greets students
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 04, 2026, 12:52 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

చెన్నై :  2026-27 విద్యా సంవత్సరానికి గాను తమిళనాడు వ్యాప్తంగా పాఠశాలలు గురువారం నుండి ప్రారంభమయ్యాయి. అయితే ఈ విద్యా సంవత్సరం జూన్ 1న ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ, రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తీవ్రమైన ఎండల కారణంగా మూడు రోజుల పాటు ప్రభుత్వం వాయిదా వేసింది. పాఠశాలలు తిరిగి తెరుచుకున్న సందర్భంగా తమిళనాడు ముఖ్యమంత్రి సి. విజయ్ జోసెఫ్ విద్యార్థులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. “ కొత్త విద్యా సంవత్సరం కోసం పాఠశాలలకు తిరిగి వస్తున్న విద్యార్థులు, విద్య, కఠోర శ్రమ ద్వారా తమ కలలను సాకారం చేసుకోవాలని ఆయన ఆకాంక్షించారు. “కొత్త ఆశతో ఈ విద్యా సంవత్సరం మొదటి రోజును ప్రారంభిస్తున్న నా ప్రియమైన విద్యార్థులకు హృదయపూర్వక శుభాకాంక్షలు. విద్య అనేది మీ భవిష్యత్తును ప్రకాశవంతం చేసే శక్తి. ఉన్నతమైన కలలను ఎంచుకోండి. దానికి అనుగుణంగా కష్టపడండి. మీరు పాఠశాలకు వెళ్లే ప్రతి రోజూ మీ జీవితంలో ఒక ముందడుగు కావాలి. ఆనందంతో నేర్చుకోండి, విజయం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది.” అని ముఖ్యమంత్రి విజయ్ ఎక్స్ లో పేర్కొన్నారు.

ఇటీవల ప్రకటించిన 10వ తరగతి బోర్డు పరీక్షల ఫలితాల్లో విద్యార్థులు అద్భుతమైన ప్రతిభ కనబరిచిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది పదో తరగతి పరీక్షల్లో మొత్తం ఉత్తీర్ణత శాతం 94.31 శాతంగా నమోదైందని మే 20న విద్యాశాఖ మంత్రి రాజ్‌మోహన్ ప్రకటించారు. గత ఏడాదితో పోలిస్తే 0.51 శాతం ఎక్కువ. అధికారిక గణాంకాల ప్రకారం మొత్తం 8,79,643 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా, వారిలో 8,21,105 మంది విజయవంతంగా ఉత్తీర్ణులయ్యారు. ఈ ఫలితాల్లోనూ బాలికలు తమ ఆధిక్యతను చాటుకున్నారు. బాలుర ఉత్తీర్ణత శాతం 92.15 కాగా, బాలికలు 96.6 శాతంతో ముందంజలో నిలిచారు.

రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థలు కూడా ఈ పరీక్షల్లో అద్భుతమైన ఫలితాలను సాధించాయి. 1,931 ప్రభుత్వ పాఠశాలలతో సహా మొత్తం 5,171 పాఠశాలలు 100 శాతం ఉత్తీర్ణత సాధించి రికార్డు సృష్టించాయి. జిల్లాల వారీగా చూస్తే, 97.57 శాతం ఉత్తీర్ణతతో పుదుక్కోట్టై జిల్లా రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలిచింది. ఫలితాల ప్రకటన తర్వాత స్కూల్ డ్రాపౌట్స్ పై వ్యక్తమవుతున్న ఆందోళనలపై ఆయన స్పందించారు. ప్రభుత్వం నిరంతరం బాలల కేంద్రీకృత విధానాలపైనే దృష్టి సారిస్తుందని, విద్యార్థులెవరూ చదువును మధ్యలో ఆపేయకుండా తగిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్