test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పొదుపు పాటించండి

18 మే, 2026

lic
వెబ్ డెస్క్

ప్రచురించబడింది మే 19, 2026, 12:50 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

- ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఎల్‌ఐసికి కేంద్రం ఆదేశం
- విద్యుత్‌ వాహనాలు వాడాలని సూచన
న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగ బ్యాంక్‌‌లు, ఎల్‌ఐసి, ఇతర ఆర్థిక సంస్థలు పొదుపు చర్యలు పాటించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర ఆర్థికశాఖ నుండి సోమవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఉద్రిక్తతలు, పశ్చిమాసియా వివాదాల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థపై పడే ప్రభావాన్ని తగ్గించడానికి ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ఇందులో భాగంగా దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకులు ఎస్‌‌బిఐ, బ్యాంక్‌ ఆఫ్‌ ‌బరోడా, ఎల్‌ఐసి, ఇతర ఆర్థిక సంస్థలు కఠినమైన పొదుపు చర్యలను పాటించాలని ఆదేశించింది. ఛైర్మన్లు, ఎండి, సిఇఒ తదితర ఉన్నత స్థాయి అధికారుల విదేశీ ప్రయాణాలపై ఆంక్షలు విధించడంతో పాటు, భౌతికంగా హాజరుకావడం తప్పనిసరి అయితే తప్ప అన్ని రకాల సమావేశాలు, సమీక్షలను కేవలం వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే నిర్వహించాలని స్పష్టం చేసింది.ఈ వ్యయ నియంత్రణ చర్యలతో పాటు, పర్యావరణ పరిరక్షణ.
ఇంధన ఖర్చుల తగ్గింపుపై కూడా దృష్టి సారించాలని సూచించింది. సంస్థల ప్రధాన కార్యాలయాలు, బ్రాంచ్ ఆఫీసుల్లో ప్రస్తుతం అద్దెకు వాడుతున్న పెట్రోల్, డీజిల్ వాహనాల స్థానంలో వీలైనంత త్వరగా దశలవారీగా విద్యుత్‌ వాహనాలను (ఇవి) ప్రవేశపెట్టాలని ఆదేశించింది. రూపాయి విలువ రికార్డు స్థాయి కనిష్టానికి పడిపోవడం, ద్రవ్యోల్బణం పెరిగే ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ కఠిన నిబంధనలను అమలులోకి తెచ్చిందని తెలిపింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్