mh ad
శుక్రవారం, 19 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

నందలూరు వాసికి జాతీయ వాగ్దేవి పురస్కారం

30 మే, 2026

నందలూరు వాసికి జాతీయ వాగ్దేవి పురస్కారం
వెబ్ డెస్క్

ప్రచురించబడింది మే 30, 2026, 10:48 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం


ప్రజాశక్తి - నందలూరు : ప్రముఖ నృత్య కళాకారిణి, కవయిత్రి, తెలుగు కళావేదిక అధ్యక్షురాలు, నందలూరు వాసి డాక్టర్ కోడూరు సుమన కుమారి కి జాతీయ వాగ్దేవి పురస్కారం ప్రదానం చేయనున్నట్లు జాతీయ తెలుగు సారస్వత పరిషత్ కార్య నిర్వాహక అధ్యక్షులు కేశిరాజు రాంప్రసాద్ తెలియజేశారు. ఈ మేరకు డాక్టర్ సుమన కుమారికి ఆహ్వాన పత్రిక పంపినట్లు ఆయన తెలియ జేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... జూన్ నెల 5వ తేదీన ఉదయం శ్రీ కాళహస్తిలోని గంగాసదన్ లో జాతీయ తెలుగు సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో కవి సమ్మేళనం, జాతీయ వాగ్దేవి పురస్కారాల ప్రదానోత్సవం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. డాక్టర్ సుమన కుమారికి ఈ పురస్కారం లభించడం పట్ల నందలూరు కథానిలయం కార్యదర్శి అల్లం అశోక్ కుమార్, పలువురు కవులు, రచయితలు, సాహితీ ప్రియులు హర్షం వ్యక్తం చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్