ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ‘ఎబోలా’ వైరస్‌కు సంబంధించి రాష్ట్రంలో ముందస్తు చర్యలు చేపట్టామని వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. కాంగో, ఉగాండా, దక్షిణ సూడాన్ దేశాల్లో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉందని, కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న మార్గదర్శకాలు ఆధారంగా కేసులను ఎదుర్కొనేందుకు వైద్యారోగ్యశాఖ సిద్ధంగా ఉందని ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విశాఖ, తిరుపతి, విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుల ద్వారా వచ్చే ప్రయాణికులకు, పర్యాటకులను వైరస్ నిర్ధారణ పరీక్షలు చేసే విషయంలో ఎయిర్ పోర్ట్ అథార్టీ, సదరు జిల్లాల వైద్యారోగ్యశాఖ అధికారులు సమన్వయంతో వ్యవహరించేలా చర్యలు తీసుకుంటున్నా మన్నారు. వైరస్ లక్షణాలు కలిగిన వారిని వెంటనే క్వారంటైన్ చేసి, పక్కనున్న వారికి కూడా వెంటనే వైద్య పరీక్షలు చేస్తామని తెలిపారు. విశాఖ ఓడరేవు, రోడ్డు మార్గాల ద్వారా వచ్చే వారి విషయంలోనూ అవసరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. అంతర్జాతీయ విమానాశ్రయాల నగరాల్లోని టీచింగ్ ఆస్పత్రుల్లో ప్రత్యేకంగా ఏర్పాటుచేసే ఐసోలేషన్ వార్డుల్లో 15 పడకల చొప్పున ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
‘ఎబోలా’పై అప్రమత్తం
24 మే, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది మే 25, 2026, 12:01 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం








కామెంట్లు (0)