ఉండి (పశ్చిమ గోదావరి) : ‘ఇది ప్రజాస్వామ్య రాజ్యంలా కనిపించడం లేదు… బుల్డోజర్ రాజ్యంలా కనిపిస్తుంది` అంటూ …. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఉణుదుర్రు గ్రామంలో ఇళ్ల అక్రమ కూల్చివేతలపై సిపిఎం నేతలు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. శుక్రవారం సిపిఎం నేతలు గ్రామంలో పర్యటించారు. అక్కడి బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ .... పేదల ఇండ్లను అన్యాయంగా కూల్చివేయడం దారుణమన్నారు. ఇది ప్రజాస్వామ్య రాజ్యమా ? లేక బుల్డోజర్ రాజ్యమా ? అని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, సిపిఎం జిల్లా కార్యదర్శి జె ఎన్ వి గోపాలన్, తదితర నాయకులు పాల్గొన్నారు.
‘ఇది బుల్డోజర్ రాజ్యంలా కనిపిస్తుంది` : వి.శ్రీనివాసరావు
15 మే, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది మే 15, 2026, 01:35 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం








కామెంట్‌లు (0)