mh ad
శుక్రవారం, 19 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

తడ వద్ద జాతీయ రహదారిపై ప్రైవేట్ బస్సు దహనం

6 రోజుల క్రితం

fire
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 13, 2026, 12:34 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-తడ(తిరుపతి): జిల్లాలోని తడ సమీపంలో జాతీయ రహదారిపై ఓ ప్రైవేట్ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. శ్రీసిటీలో విధులు ముగించుకుని కార్మికులతో సూళ్లూరుపేట వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సులో మంటలను గమనించిన కార్మికులు వెంటనే కిందకు దిగిపోవడంతో తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేసే లోపే వాహనం పూర్తిగా బూడిదైంది. ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్