mh ad
శుక్రవారం, 19 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

డబుల్ గోల్డ్.. ఆర్చర్‌ ధీరజ్‌ను అభినందించిన సీఎం చంద్రబాబు

4 రోజుల క్రితం

ap cm
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 15, 2026, 12:24 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-అమరావతి : టర్కీలోని అంటాల్యాలో జరిగిన ఆర్చరీ వరల్డ్ కప్ స్టేజ్-3 పోటీల్లో ధీరజ్ రెండు స్వర్ణ పతకాలు సాధించి చరిత్ర సృష్టించారు. ఈ సందర్భంగా ఆర్చర్ ధీరజ్ బొమ్మదేవరపై ఎపి సిఎం  చంద్రబాబు నాయుడు ప్రశంసల వర్షం కురిపించారు.. “బలమైన ప్రత్యర్థులపై అద్భుత ప్రదర్శన కనబర్చి ధీరజ్ సాధించిన ఈ విజయం రాష్ట్రానికే కాకుండా యావత్ దేశానికి గర్వకారణం. ఈ ఘనత ఎందరో యువ క్రీడాకారులకు స్ఫూర్తినిస్తుంది” అని పేర్కొన్నారు. ధీరజ్‌తో పాటు కుంకుమ్ మోహోద్‌ను, భారత బృందాన్ని కూడా ఆయన అభినందించారు.

ఈ టోర్నీలో ధీరజ్.. మిక్స్‌డ్ టీమ్ విభాగంలో కుంకుమ్ అనిల్ మోహోద్‌తో కలిసి దక్షిణ కొరియా అగ్రశ్రేణి జోడీని ఓడించి స్వర్ణం కైవసం చేసుకున్నారు. అనంతరం అదే రోజు జరిగిన పురుషుల వ్యక్తిగత రికర్వ్ ఫైనల్‌లో ఒలింపిక్ పతక విజేత లీ వూ-సియోక్‌పై 7-3 తేడాతో ఘనవిజయం సాధించి, తన కెరీర్‌లో తొలి వ్యక్తిగత వరల్డ్ కప్ స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకున్నారు. దాదాపు ఐదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత, ఒక భారతీయ పురుష ఆర్చర్ వరల్డ్ కప్‌లో వ్యక్తిగత స్వర్ణ పతకం సాధించాడు.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్