mh ad
శుక్రవారం, 19 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

కొండవీటి, పాలవాగులపై 69 బ్రిడ్జిల నిర్మాణం

6 రోజుల క్రితం

narayana
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 13, 2026, 11:03 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-తుళ్లూరు : రాజధాని అమరావతి పరిధిలోని కొండవీటి వాగు, పాలవాగులపై మొత్తం 69 బ్రిడ్జిల నిర్మాణం జరుగుతోందని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ  తెలిపారు. ఈ రెండు వాగులపై జరుగుతున్న వంతెనల పనులను మంత్రి పి. నారాయణ శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని అమరావతిలో ఎక్కడా నీటి నిల్వలు లేకుండా అవసరమైన ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఈ రెండు వాగులపై మొత్తం 69 బ్రిడ్జిల నిర్మాణం జరుగుతోందని, వర్షపు నీరు సాఫీగా సాగిపోయేలా ఇంజనీరింగ్ ప్రణాళికలతో పనులు వేగవంతం చేశామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అమరావతిలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి కేంద్ర క్యాబినెట్ ఇప్పటికే ఆమోదం తెలిపిందన్నారు. అమరావతి భవనాల నిర్మాణ వ్యయంపై వైసిపి నేతలు చేస్తున్న ఆరోపణలను మంత్రి తీవ్రంగా ఖండించారు. కేంద్ర ప్రభుత్వ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ నిర్మాణానికి చదరపు అడుగుకు రూ. 3,945 ఖర్చు అవుతుంటే, అమరావతి హ్యాపీనెస్ట్ నిర్మాణానికి రూ. 3,393, గెజిటెడ్ అధికారుల నివాసాలకు రూ. 3,684 మాత్రమే వ్యయం అవుతోందని తెలిపారు. ఐకానిక్ భవనాలు కావడం వల్లే కొన్నింటికి కొద్దిగా ఖర్చు ఎక్కువ అవుతుందని, పార్లమెంట్ భవనానికైనా, తెలంగాణ సచివాలయం నిర్మాణానికైనా తొలిసారి పిలిచిన టెండర్లుకి.. పూర్తయ్యేనాటికి భారీగా ఖర్చయిందని.. ఖర్చు పెరగడం సహజమేనని పేర్కొన్నారు. వైసిపి నాయకులు ఇకనైనా అబద్ధపు ప్రచారాలు మానకపోతే వచ్చే ఎన్నికల్లో వారికి 11 సీట్లు కూడా రావంటూ ఘాటుగా ఎద్దేవా చేశారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్