mh ad
శుక్రవారం, 19 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

స్టీల్ ప్లాంట్ ప్రమాద మృతుల కుటుంబాలకు కోటి రూపాయలు నష్టపరిహారం చెల్లించాలి : జేఎసీ

2 రోజుల క్రితం

Compensation of ₹1 crore must be paid to the families of those who died in the steel plant accident: JAC.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 17, 2026, 01:44 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

విశాఖ : విశాఖ స్టీల్ ప్లాంట్ బాధిత కుటుంబాలకు కోటి రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని విశాఖ అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ డిమాండ్ చేసింది. బుధవారం విశాఖలో జేఏసీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎస్ఎంఎస్ విభాగంలో 1600 డిగ్రీల వేడిలో వున్న ద్రవ ఉక్కు లేడర్ పేలిన ప్రమాదంలో పదిమంది చనిపోయారు. వీరి మృతికి విశాఖపట్నం అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ తీవ్ర సంతాపాన్ని తెలియజేసింది. ఈ ప్రమాదంపై న్యాయ విచారణ జరిపించాలని, చనిపోయిన బాధిత కుటుంబాలకు కోటి రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని, శాశ్వత ఉపాధి కల్పించాలని, క్షతగాత్రులకు 50 లక్షల రూపాయలు చెల్లించాలని పూర్తిగా వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరించాలని విశాఖ అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ నేతలు డిమాండ్ చేశారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్