- సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు సంతాపం
ప్రజాశక్తి-సత్తెనపల్లి (పల్నాడు జిల్లా) : సిపిఎం పల్నాడు జిల్లా కార్యదర్శి గుంటూరు విజయ్ కుమార్‌కు పితృవియోగం కలిగింది. ఆయన తండ్రి సీనియర్ నాయకులు, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట నాయకులు గుంటూరు వేమయ్య (102) మరణించారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. భౌతికకాయాన్ని సత్తెనపల్లిలోని ఆయన నివాసానికి తరలించారు. వేమయ్యకు భార్య వెంకాయమ్మ, పెద్ద కుమారుడు సిపిఎం జిల్లా కార్యదర్శి విజయ్ కుమార్, చిన్న కుమారుడు జగదీష్ ఉన్నారు. భౌతికకాయాన్ని ఆదివారం మెడికల్ కాలేజీకి అప్పగించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. అనంతరం మధ్యాహ్నం మూడు గంటలకు సత్తెనపల్లిలోని వేమయ్య ఇంటి వద్ద సంతాప సభ నిర్వహించనున్నట్లు, ఈ సభకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు హాజరుకానున్నారు. భౌతికకాయాన్ని సిపిఎం, ప్రజాసంఘాల నాయకులు సందర్శించి నివాళులర్పించారు. వీరిలో గద్దె చమలయ్య, ఎ.లక్ష్మీశ్వరరెడ్డి, ఏపూరి గోపాలరావు, ఎస్.ఆంజనేయులు నాయక్, జి.రవిబాబు, జి.మల్లేశ్వరి, జి.ఉమశ్రీ, డి.విమల, పి.మహేష్, పి.సూర్య ప్రకాష్ రావు, ఎ.వెంకటనారాయణ, కె.జగన్, ఎం.జ్యోతి, జి.రమేష్ ఉన్నారు.
ఆదర్శ కమ్యూనిస్టు..
వేమయ్య మృతికి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు సంతాపం తెలిపారు. చివరి శ్వాస వరకు ఆదర్శ కమ్యూనిస్టుగా నిలిచారని ఆయన కొనియాడారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో చురుకుగా పాల్గొన్నారని గుర్తు చేశారు. వేమయ్య కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రజా, రైతు సమస్యలపై తుది శ్వాస విడిచే వరకూ పోరాటం చేశారని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.









కామెంట్‌లు (0)