బ్యాంకాక్: థాయ్‌లాండ్ ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్-500 టోర్నీలో సాత్విక్ సాయిరాజ్- చిరాగ్‌శెట్టి జోడీ సంచలనం సృష్టించింది. సెమీస్‌లో మలేషియా జోడీపై మూడుసెట్ల ఉత్కంఠ భరిత పోరులో విజయం సాధించి ఫైనల్లోకి దూసుకెళ్లారు. శనివారం జరిగిన హోరా హోరీ పోరులో సాత్విక్-చిరాగ్ జంట 19-21, 22-20, 21-16 తేడాతో 3వ సీడ్, మలేషియాకు చెందిన గో జెఫీ – నూర్ ఇజ్జుద్దీన్ జంటను ఓడించి ఫైనల్‌కు దూసుకెళ్లారు. ఈ సీజన్లో ఇదే తొలి ఫైనల్ కావడం గమనార్హం. తొలి సెట్‌ను మలేషియా ఆటగాళ్లు 21-19 తేడాతో సొంతం చేసుకున్నారు. రెండో గేమ్ పోటా పోటీగా సాగినా.. చివర్లో అద్భుతంగా పుంజుకున్న భారత జోడీ ఆ గేమ్ ను 22-20తో కైవసం చేసుకుంది. మ్యాచ్‌ను తేల్చే మూడో సెట్లో విజయం కోసం ఇరు జట్లూ తీవ్రంగా శ్రమించాయి. అయితే, భారత జోడీ దూకుడు ప్రదర్శించి 21-16తో సెట్‌ను.. అలాగే మ్యాచ్‌ను గెలుచుకుంది. ఇటీవలే సాత్విక్ – చిరాగ్ జోడీ థామస్ కప్‌లో పతకం సాధించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో తమను ఎవరూ పట్టించుకోలేదని ఇటీవల సాత్విక్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఆదివారం జరిగే ఫైనల్లో భారత జంట ఇండోనేషియాకు చెందిన లియో-రోలే, డానియేల్ మార్తిన్ తో తలపడనున్నారు. ముఖాముఖి పోరులో భారత జంట 4-0తో ఆధిక్యతలో నిలిచినా.. ఫైనల్లో వీరిద్దరూ తలపడడం ఇదే తొలిసారి. రెండో సెమీస్ లో మలేషియా జంట 21-15, 21-18తో చైనా షట్లర్లను చిత్తుచేశారు. ఇక మహిళల సింగిల్స్ ఫైనల్లోకి టాప్ సీడ్, జపాన్ కు చెందిన యమగుచి, 2వ సీడ్, చైనాకు చెందిన చెన్-యూఫీ ప్రవేశించగా.. పురుషుల సింగిల్స్ ఫైనల్లోకి 2వ సీడ్, ఇండోనేషియాకు చెందిన విదిత్ శరన్, టాప్ సీడ్, చైనాకు చెందిన షీ-యు ఖీ ప్రవేశించారు.
ఫైనల్ కు చిరాగ్-సాత్విక్
16 మే, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది మే 16, 2026, 11:18 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం








కామెంట్లు (0)