test1
సోమవారం, 15 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పాక్‌‌పై గెలుపు.. టీ20ల్లో దీప్తి శర్మ, హర్మన్ సరి కొత్త రికార్డు

2 గంటల క్రితం

harman and deepti
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 15, 2026, 01:41 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్థాన్‌పై భారత్ 64 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత ఆల్‌రౌండర్ దీప్తి శర్మ 5 వికెట్లు తీసి మహిళల టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు (166) తీసిన బౌలర్‌గా చరిత్ర సృష్టించింది. థాయ్‌లాండ్ స్పిన్నర్ థిపాచా పుత్తావోంగ్ (165) రికార్డును అధిగమించింది. అంతర్జాతీయ క్రికెట్‌లో 350కి పైగా వికెట్లు తీసిన రెండో భారత మహిళా క్రికెటర్‌గా కూడా దీప్తి నిలిచింది.

హర్మన్ కూడా ఓ ఘనత..

భారత మహిళా జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ ఓ ఘనతను తన ఖాతాలో వేసుకుంది. హర్మన్ పాక్‌పై 35 బంతుల్లో 36 పరుగులు చేసింది. టీ20 ప్రపంచ కప్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా ఘనత సాధించింది. మొత్తం 34 మ్యాచుల్లో 732 పరుగులు చేసింది. ఈ క్రమంలో మిథాలీ రాజ్‌ (726)ను హర్మన్‌ను అధిగమించింది. హర్మన్‌కిది 10వ టీ20 ప్రపంచ కప్‌ టోర్నీ కావడం గమనార్హం.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్