కార్పొరేట్లు, నూతన ధనిక వర్గాలు,మతోన్మాద శక్తులు, ట్రంప్ మాత్రమే పండుగ చేసుకుంటున్నారు : సుభాషిణి అలీ, బి. వెంకట్, విక్రమ్ సింగ్ ధ్వజం
న్యూఢిల్లీ / పట్నా (జూన్ 14) : కేంద్రంలోని మోడి ప్రభుత్వం తన పాలనా కాలంపై జరుపుకుంటున్న సంబరాలు దేశ ప్రజలవి కావని, అవి కేవలం కార్పొరేట్ గుత్తాధిపతులు, నూతన ధనిక వర్గాలు, మతోన్మాద శక్తులు, అమెరికా సామ్రాజ్యవాదులవి మాత్రమేనని సిపిఐ(ఎం) జాతీయ సీనియర్ నాయకురాలు సుభాషిణి అలీ, AIAWU ప్రధాన కార్యదర్శి బి. వెంకట్, కార్యదర్శి విక్రమ్ సింగ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బీహార్ రాష్ట్ర AIAWU 11వ మహాసభల సందర్భంగా భాబూ నగర కేంద్రంలో జరిగిన భారీ బహిరంగ సభలో వారు ముఖ్య వక్తలుగా మాట్లాడారు.
ఈ సందర్భంగా వక్తలు లేవనెత్తిన ప్రధానాంశాలు :
కార్పొరేట్, సామ్రాజ్యవాద సేవలు : దేశ సంపదను, సహజ వనరులను కొద్దిమంది కార్పొరేట్లకు మోడి ప్రభుత్వం కట్టబెడుతోంది.
అమెరికా అధ్యక్షుడిగా ఉన్న ట్రంప్ కుటుంబ వ్యాపారాల్లో భారత కార్పొరేట్ దిగ్గజాలు భారీగా పెట్టుబడులు పెడుతుంటే కేంద్రం మౌనంగా మద్దతిస్తూ జాతీయ ప్రయోజనాలను తాకట్టు పెడుతోంది.
ఉపాధి హామీపై దాడి : గ్రామీణ పేదల పాలిట వరమైన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని (MGNREGA) బలహీనపరిచి, దాని స్థానంలో “జీ-రామ్” అనే కొత్త చట్టాన్ని తెచ్చి జూలై 1 నుండి అమలు చేయబోతున్నారు. ఇది పేదల ఉపాధి హక్కుపై జరుగుతున్న ప్రత్యక్ష దాడి.
ధరల భారం – నిరుద్యోగం : వంటగ్యాస్, పెట్రోల్, డీజిల్, నిత్యావసరాలు, విద్య, వైద్యం సామాన్యులకు భారంగా మారాయి. దేశంలో నిరుద్యోగం, ఆకలి పెరుగుతుంటే ప్రభుత్వం మతోన్మాద రాజకీయాలను రెచ్చగొడుతోంది. మైనారిటీలు, దళితులు, ఆదివాసీలు, మహిళలపై దాడులు పెరిగాయి.
అభివృద్ధి పేరిట భూముల దోపిడీ : గ్రీన్ ఎనర్జీ, కారిడార్లు, ఎక్స్‌ప్రెస్‌వేల పేరుతో రైతులు, ఆదివాసీల నుంచి లక్షల ఎకరాల భూములను బలవంతంగా లాక్కొని కార్పొరేట్లకు ఇస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా గ్రామ గ్రామాన ‘ప్రతిఘటన కమిటీలు’ వేసి పోరాడాలని పిలుపునిచ్చారు.
దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం : నియోజకవర్గాల డీలిమిటేషన్ పేరుతో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేసే కుట్రలు జరుగుతున్నాయని, సీట్ల పెంపు జనాభా ప్రాతిపదికన కాకుండా అన్ని రాష్ట్రాలకు న్యాయం జరిగేలా ఉండాలని డిమాండ్ చేశారు. డెలిమిటీషన్ తో లింక్ పెట్టకుండా ఏంటనే మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టనీ వారు డిమాండ్ చేశారు.
sir దేశ ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఉంది అందు లోను దళితులు, గిరిజనలు, ఇతర సామాజిక వర్గాలకు, పేదలకు ఓటు హక్కు ను ఏకుండా చెయ్యటమే
బీహార్ దుస్థితి : బీహార్‌లో దళితులు, వెనుకబడిన వర్గాలు భూస్వామ్య-పెట్టుబడిదారీ దోపిడీకి గురవుతున్నారు. ఉపాధి లేక లక్షలాది మంది యువకులు ఇతర రాష్ట్రాలకు వలసపోతున్నారు.
ప్రజా వ్యతిరేకతకు అద్దం : దేశంలో పెరుగుతున్న అసంతృప్తికి, ఇటీవల వేగంగా పుంజుకుంటున్న “కాక్రోచ్ జనతా పార్టీ” వంటి శక్తుల ఎదుగుదలే నిదర్శనం. ఇది బిజెపి పై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను స్పష్టం చేస్తోంది.
సభ నినాదాలు :
“దేశ సంపద కార్పొరేట్లకు కాదు – ప్రజలకే ! భూమి మా హక్కు – దోపిడీదారులకు కాదు ! మతోన్మాదం కాదు – రాజ్యాంగమే దేశానికి మార్గదర్శి ! దేశాన్ని కాపాడేది మోడి సంబరాలు కాదు – ప్రజల పోరాటాలే !”
ఈ సభలో రైతు సంఘం నాయకులు లలాన్ చౌదరి, AIAWU నాయకులు భోళా ప్రసాద్, దేవేందర్, రామశ్రమ్ మహేతో, పాశ్వాన్ తదితరులు పాల్గొన్నారు.









కామెంట్‌లు (0)