test1
సోమవారం, 15 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

టివి న‌టి సంచితా ఉగాలే ఆత్మ‌హ‌త్య

2 గంటల క్రితం

TV actress Sanchita Ugale commits suicide.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 15, 2026, 03:33 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ముంబయి : టివి న‌టి సంచితా ఉగాలే ఆత్మ‌హ‌త్య చేసుకున్నది. ఆమె వ‌య‌సు 22 ఏళ్లు. ‘కుంకుమ భాగ్య’ సీరియల్‌లో దియా టాండన్‌గా సంచిత బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరయ్యారు. తనదైన నటనతో ప్రేక్షకులను అలరించారు. అలాగే ‘వాగ్లేకి దునియా’, టీవీ డ్రామా ‘దిల్‌వాలీ దుల్హా లే జాయేగి’ తదితర వాటిల్లో నటించి మెప్పించారు. చావా చిత్రంలో కూడా ఆమె న‌టించింది. సంచిత ప్రస్తుతం తన తల్లిదండ్రులు, సోదరితో కలిసి నలసోపరాలో ఉంటున్నారు. ఈ ఘటన జరిగినప్పుడు ఇంట్లో సంచిత ఒక్కరే ఉన్నారని పోలీసులు వెల్లడించారు. ఆదివారం సాయంత్రం 6.30 నుంచి 7.30 గంటల సమయంలో ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డానికి కొన్ని గంట‌ల ముందు ఆమె త‌న సోష‌ల్ మీడియాలో ఫోటోలు, వీడియోలు షేర్ చేసింది. ఆత్మహత్యకు గల కారణాలు మాత్రం ఇప్పటివరకూ తెలియరాలేదు. ఘటన జరిగిన ప్రాంతంలో ఎలాంటి ఆధారాలు లభించలేదని, అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటికే కుటుంబ సభ్యుల నుంచి వాంగ్మూలాన్ని తీసుకున్నారు. అదే సమయంలో ఇతర సహ నటులను సైతం పోలీసులు విచారిస్తున్నారు. సంచిత మృతదేహానికి పోస్టుమార్టం పూర్తయి.. నివేదిక వచ్చాక తదుపరి విచారణ కొనసాగుతుందని తెలిపారు. రూమ్‌లోని సీలింగ్ ఫ్యాన్‌కు న‌టి సంచితా ఉరి వేసుకున్న‌ట్లు పోలీసులు చెప్పారు. ఆమెను వెంట‌నే ఆస్ప‌త్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందిన‌ట్లు డాక్ట‌ర్లు ద్రువీక‌రించారు. యాక్సిడెంట‌ల్ డెత్ రిపోర్టును రిజిస్ట‌ర్ చేశారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్