test1
సోమవారం, 15 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఆ భూభాగాల నుండి సైన్యం వెనక్కి వెళ్లదు : ఇజ్రాయిల్

1 గంట క్రితం

Defence Minister says Israel won’t withdraw
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 15, 2026, 03:44 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

టెల్ అవీవ్ :   లెబనాన్, సిరియా, గాజాల్లో తాము స్వాధీనం చేసుకున్న భూభాగాల నుండి ఇజ్రాయెల్ సైన్యం వెనక్కి వెళ్లదని  ఆ దేశ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్  పేర్కొన్నారు.  ఈ ప్రాంతాల్లో ఇజ్రాయెల్ నిరవధికంగా కొనసాగుతుందని సోమవారం ఆయన వెల్లడించారు. ఇరాన్, అమెరికాల మధ్య మధ్యంతర ఒప్పందం కుదిరినట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో కాట్జ్ మొదటిసారి అధికారికంగా స్పందించారు.  గడిచిన రెండున్నర సంవత్సరాలలో గాజా, లెబనాన్, సిరియాలలో ఇజ్రాయెల్ సుమారు 1,000 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకుంది. ఈ విస్తీర్ణం అమెరికాలోని న్యూయార్క్ నగరం కంటే చాలా పెద్దది కావడం గమనార్హం. మరోవైపు, లెబనాన్‌లోని హిజ్బుల్లాపై ఇజ్రాయెల్ దాడులను పూర్తిగా నిలిపివేస్తేనే ఈ మధ్యంతర ఒప్పందం ముందుకు సాగుతుందని ఇరాన్ షరతు విధించింది. అయితే, లెబనాన్‌పై దాడులకు ప్రతీకారంగా ఇరాన్ గనుక తమ దేశంపై నేరుగా దాడికి దిగితే, తాము కూడా భారీ ఆయుధాలతో ఇరాన్‌పై విరుచుకుపడతామని కాట్జ్  హెచ్చరించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్