తెలంగాణ : హైదరాబాద్ గండిపేట భూముల కబ్జా కేసులో ఎపి కి చెందిన వైసిపి మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు చంచల్ గూడా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి మరింత లోతుగా విచారణ జరపాలని భావించిన పోలీసులు కోర్టును ఆశ్రయించారు. బ్రహ్మనాయుడును విచారించేందుకు కస్టడీ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు సోమవారం బ్రహ్మనాయుడును పోలీసుల కస్టడీకి అనుమతిస్తూ రంగారెడ్డి జిల్లా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. రేపటి నుంచి మూడు రోజులపాటు బొల్లా బ్రహ్మనాయుడిని కస్టడీకి తీసుకుని పోలీసులు విచారించనున్నారు. ఇదిలా ఉండగా.. ఈ కేసులో బ్రహ్మనాయుడు బాధితుడిని వైసిపి శ్రేణులు ఆరోపిస్తున్నారు. ఎపి సర్కార్ తెలంగాణ ప్రభుత్వంతో కుమ్మక్కయ్యి బ్రహ్మనాయుడుపై కేసు పెట్టిందని ఆరోపిస్తున్నారు. బ్రహ్మనాయుడు క్లీన్ చిట్ తో బయటికి వస్తాడని వైసిపి శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
3 రోజులు పోలీసుల కస్టడీకి వైసిపి మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 15, 2026, 03:48 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం







కామెంట్‌లు (0)