కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని ఫల్తా అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నిక ఫలితాలు ఆసక్తిని రేపాయి. మతతత్వ, కార్పొరేట్ రాజకీయాలకు వ్యతిరేకంగా ప్రజలు లెఫ్ట్ ఫ్రంట్ వైపు చూస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల సంఘం వెల్లడించిన వివరాల ప్రకారం, బిజెపి అభ్యర్థి 1,49,666 ఓట్లతో విజయం సాధించగా, సిపిఎం అభ్యర్థి శంభునాథ్ కుర్మీ 40,645 ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలిచారు. ముఖ్యంగా సిపిఎం అభ్యర్థి శంభునాథ్ కుర్మీ సాధించిన ఓట్లు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఫల్తాలో సిపిఎం ప్రత్యక్షంగా పోటీ చేయలేదు. ఆ సమయంలో లెఫ్ట్ మద్దతుతో కాంగ్రెస్ అభ్యర్థి అబ్దుర్ రజాక్ మొల్లా కేవలం 7,452 ఓట్లు మాత్రమే సాధించారు. 2026 అసెంబ్లీ ఎన్నికలు తీవ్ర రాజకీయ ఉద్రిక్తతల మధ్య జరిగాయి. అసెంబ్లీ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు వెల్లువెత్తగా, ప్రజల్లో అసంతృప్తి పెరిగిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి జహంగీర్ ఖాన్ పోలింగ్‌కు రెండు రోజుల ముందు పోటీ నుంచి తప్పుకోవడం మరింత చర్చకు దారితీసింది.
కాంగ్రెస్ ఈసారి స్వతంత్రంగా బరిలోకి దింపిన అబ్దుర్ రజాక్ మొల్లా 10,084 ఓట్లు పొందారు. తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి జహంగీర్ ఖాన్ 7,783 ఓట్లతో నాలుగో స్థానంలో నిలిచారు.
ఈ ఫలితాలతో లౌకికవాదం, ప్రజాస్వామిక విలువలు, సామాజిక న్యాయం కోసం పోరాడే శక్తిగా లెఫ్ట్ ఫ్రంట్‌పై ప్రజల్లో మళ్లీ విశ్వాసం పెరుగుతోందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. బెంగాల్ రాజకీయాల్లో ఎర్రజెండా ప్రభావం మళ్లీ పెరుగుతున్న సంకేతాలు ఈ ఫలితాల్లో స్పష్టంగా కనిపిస్తున్నాయని చెబుతున్నారు.
ఫల్తా ఎన్నికల్లో పుంజుకున్న లెఫ్ట్
24 మే, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది మే 25, 2026, 12:48 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం








కామెంట్‌లు (0)