mh ad
శుక్రవారం, 19 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

తిరుగుబాటును ప్రజలు క్షమించరు : సంజయ్ రౌత్

2 రోజుల క్రితం

Raut alleges bid to lure MPs with Rs 50 cr
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 17, 2026, 01:30 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ముంబయి : శివసేన (యుబిటి)లో చీలికలు రానున్నాయన్న వార్తల నేపథ్యంలో  ఆపార్టీ నేత సంజయ్ రౌత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుగుబాటును ప్రజలు క్షమించరని మండిపడ్డారు. బుధవారం ఆయన న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశానికి అరవింద్ సావంత్, అనిల్ దేశాయ్, రాజాభవౌ వాజేలు హాజరయ్యారు.  పార్టీ మారాలంటూ తమ ఎంపిలకు రూ.50 కోట్లు ఆఫర్ చేశారని  సంజయ్ రౌత్ అన్నారు. మహారాష్ట్రకు చెందిన ఎంపీలను 'కొనుగోలు' చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని "కీలక వ్యక్తి" ఒకరు మంగళవారం అర్ధరాత్రి తనకు సమాచారం అందించారని రౌత్ చెప్పారు. ఇందుకోసం ఒక్కో ఎంపికి రూ.50 కోట్ల చొప్పున చెల్లించాలని నిర్ణయించారని, ముందస్తుగా రూ.15 కోట్లు నేడు ఇవ్వనున్నట్లు సమాచారం అందిందని అన్నారు. ముందస్తు నగదు అందిన తర్వాతే వారు పార్టీ మారతామని స్పష్టం చేసినట్లు ఆ వ్యక్తి తెలిపారని అన్నారు. అయితే, పార్టీలో చీలికకు సంబంధించి తమకు ఎటువంటి అధికారిక సమాచారం లేదని, కొంతమంది ఎంపీలు విడిపోతున్నారన్న వార్తలు కేవలం మీడియా ద్వారానే తెలిశాయని అన్నారు. ఈ విధంగా పార్టీలో చీలికలు విడిపోతుంటే.. ఇక ఎన్నికల్లో పోటీ చేయడంలో అర్థమే ఉండదని అన్నారు.
ఉద్ధవ్ థాకరే నాయకత్వంలో శివసేన (యుబిటి) నేతలంతా  `కాగడా (మషాల్ )' గుర్తుపైనే పోటీ చేసి విజయం సాధించారని, ప్రజా తీర్పుకు ద్రోహం చేసే హక్కు ఎవరికీ లేదని రౌత్ స్పష్టం చేశారు. 2022లో పార్టీ చీలికకు దారితీసిన పరిస్థితులు మళ్లీ పునరావృతమైతే రాష్ట్ర ప్రజలు, కార్యకర్తలు క్షమించరని, ఈతిరుగుబాటుకు గట్టి ప్రతిస్పందన ఉంటుందని హెచ్చరించారు. ఎవరైనా పార్టీని వీడాలంటే ముందుగా రాజీనామా చేయాలని వారికి సవాలు విసిరారు. ఎన్నికైన ప్రజాప్రతినిధులను ``కొనుగోలు చేయడం, పార్టీ మారేలా చేయడం '' వంటి చర్యలు ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి ముప్పు కలిగిస్తాయని అన్నారు.  డబ్బుతో వ్యవహారాలను చక్కబెట్టగలరని భావిస్తే అది పొరపాటేనని సంజయ్  రౌత్  హెచ్చరించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్