ఢాకా: బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్‌లో ఉన్న భారత సహాయ హైకమిషన్ కార్యాలయంలో పనిచేస్తున్న ఒక సహాయ ప్రోటోకాల్ అధికారి మృతి చెందిన ఘటన కలకలం రేపింది. చండీగఢ్‌కు చెందిన నరేన్ ధర్ (38) మంగళవారం తెల్లవారుజామున కార్యాలయంలోని పాత వీసా సెంటర్ భవనం రెండో అంతస్తులోని టాయిలెట్ సమీపంలో అపస్మారక స్థితిలో కనిపించగా, అనంతరం ఆయన మృతి చెందినట్లు అధికారులు నిర్ధారించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం గుండెపోటుతో మరణించి ఉండవచ్చని చిట్టగాంగ్ పోలీసు అధికారి అమీనూర్ రషీద్ తెలిపారు. విదేశీ దౌత్య కార్యాలయ అధికారికి సంబంధించిన ఘటన కావడంతో అన్ని అధికారిక లాంఛనాలు పూర్తి చేసిన అనంతరం మృతదేహాన్ని చిట్టగాంగ్ మెడికల్ కాలేజ్ ఆసుపత్రి మార్చురీకి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే మరణానికి గల ఖచ్చితమైన కారణం వెల్లడవుతుందని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ అమీరుల్ ఇస్లాం తెలిపారు. ఈ ఘటనపై అసహజ మరణంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అధికారిక ప్రక్రియలు పూర్తైన తర్వాత మృతదేహాన్ని భారత సహాయ హైకమిషన్ అధికారులకు అప్పగించనున్నట్లు సమాచారం. కాగా, ఈ ఘటనపై ఢాకాలోని భారత హైకమిషన్ లేదా భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
బంగ్లాదేశ్‌లో భారత సహాయ హైకమిషన్ అధికారి మృతి
20 మే, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది మే 20, 2026, 08:42 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం








కామెంట్‌లు (0)